ఆకాశంచూడు అపారేకా,
చంద్రుడు ఎలుగుదాటులోవపైన నించున్నాడు
ఎందుకు నన్ను ఆ నల్లటి కళ్ళతో చూస్తున్నావు, పిల్లా?
అటకపైకి నిన్ను వెంబడించేటట్టు చేస్తున్నావెందుకు?
ఈరోజు నేను నీ పిల్లగాడినవుతాను
రాత్రంతా సరసమైన కబుర్లు చెబుతూ గడుపుదాము
నా బుర్రపాడుచెయ్యాలని చూడకు పిల్లా
వదిలెయ్యి, విను చెప్పేది
రాత్రిపూట ఆకాశం చుక్కలతో నిండిన కంబళీలా ఉంది
చంద్రుడు కొండల్లో ఎలుగుదాటులోవపైకి పోతున్నాడు
ఎక్కడున్నావు పిల్లోడా, నువ్వు కనపడట్లేదు
మరి నీ పిల్లదానికోసం నువ్వు వేచిచూస్తే బాగుండేది
రాత్రంతా వారి కబుర్లతో గడిచింది
మంచు కురిసిన ప్రొద్దుగూకింది.
ఈ ప్రొద్దుటకి ఒక గుక్క అరాకీ బావుంటుంది
సరైన పానీయమున్న ఒక సీసా
పిల్లది ఆ సీసా అరాకీ తెచ్చింది
ప్రొద్దుటకాస్తా మధ్యాహ్నం అయ్యింది
పిల్లవాడు పానీయమంతా ఓ కొమ్ములో పోసుకుని త్రాగాడు
చిలిపినవ్వు నవ్వాడు
ఆ పిల్ల తనకి భోజనంపెట్టి తలవంచింది
“మరి చెప్పు ఖెసుర్వేతిలో జనాల గురించి” అని అడిగింది
తాగిన పానీయం తన బుర్రకి మత్తుపట్టించింది
ఆ పిల్ల తన పక్కన కూర్చిని ఉంది
“ఓ ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, దేవుడు కోపగించుకుంటాడు”
సిగ్గుపడి కుర్రవాడు మొహంపై తెల్లబారాడు
ఎలుగుదాటులోవపైకి ప్రయాణంకట్టాడు
ఖఖ్మాతీ ఊరికి బయలుదేరాడు
అపారేకా అంటే జార్జియా దేశంలో ఒక మగవాడి పేరు. ఈ జానపదగీతం అపారేకా అనే కుర్రవాడు ప్రయాణంలో ఉండగా ఒకచోట ఆగి, అక్కడ స్నేహితురాలిని కలుసుకుని, రాత్రంతా సరసమైన కబుర్లు చెప్పినవైనం వివరిస్తోంది. పిల్లవాడికి అమ్మాయిపై మనసుపుట్టినా, సిగ్గుపడి ముందడుగు వెయ్యడు. ఈ యువతీయువకుల నిర్మలమైన ప్రేమవిశేషాలని ఈ పాటలో అలా కథలా చెప్పారు. పాట పాడింది “త్రియో మాందీలీ”అను ఒక గాయనీబృందం. ఈ అమ్మాయిలు సరదాగా వారి ఊరిప్రక్కన పాడుతూ ఈ పాటను యూట్యూబులో విడుదలచేసిన తరువాత విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చారు. జార్జియాదేశపు టివీలో కూడా వీరు ఈ పాటను ఆలపించారు. పాందూరీ అను తంత్రీవాయిద్యాన్ని మీటుతూ, గళంకలిపి పాటను పాడుతూ జానపదగేయాల కమ్మదనం చూపుతున్నారు.