ఝుం ఝుం ఝుం
తుమ్మెదలుమ్మడి ఝుం
మెత్తటి పువ్వు, పుత్తడి తేనె, ఎత్తుకు తెచ్చె, తుమ్మెద వచ్చె
ఝం ఝుం ఝం
తుమ్మెదలుమ్మడి ఝుం
నీకొక బువ్వ, నాకొక బువ్వ, పువ్వుల త్రోవ, తుమ్మెద బువ్వ
ఝం ఝుం ఝం
తుమ్మెదలుమ్మడి ఝుం
ఉప్పుల గుప్ప, గుప్పున తిరిగి, పుప్పొడి రాపి, మొక్కలు లేపి
ఝం ఝుం ఝం
తుమ్మెదలుమ్మడి ఝుం
రవ్వడి సేయ, సవ్వడి రావె, నవ్వులు తేవె, మువ్వలు తేవె
ఝం ఝుం ఝం
తుమ్మెదలుమ్మడి ఝుం
తేనెటీగల ఝమ్ నాదాన్ని ముస్తాబుగా సంబరం చేస్తూ చిన్నపిల్లలు ఆడి పాడే ఈ పాటను జర్మనభాషలో తరుచుగా పాడుకుంటారు. అదే సడితో తెలుగులో కృతి చేసాను, మీకు చిన్న పిల్లలుంటే పాడి ఆడించండి. 😀