కల్పితవార్తలకిక శెలవు
నువ్వేంచూశావో నే చెప్తా విను
తిండానికి మరీ తీపిగా
మోసపెట్టడానికి, ట్వీటుపెట్టడానికి
వాగ్బంధనం!
సమాధానమివ్వని విషయాలు మరలా చెప్తాను
నిజమంటే ఏదో ఒక రోజు తయారుచేయబడినదే
మాటల్లో పెట్టలేని మాటలను నల్లగా పూతేయవచ్చు
నీకేదన్నా పోయిందా అంటే ఒక కాగితపు ముక్కనే
కల్పితవార్తలకిక శెలవు
నువ్వేంచూశావో అది నేను చెప్తా విను
ఏం తిండానికన్నా తియ్యగా
మోసపెట్టడానికన్నా.. ట్వీటుపెట్టడానికన్నా
జాగృతి అలా వేచిచూస్తోంది
కల్పిత సంగీతపు లయలకు ఇక శెలవు
అలా పట్టనట్టు నాట్యమాడుతూనే ఉండు
తినడానికి ఏమి తినాలో తియ్యగా నే పెడ్తా కదా
మోసపెట్టడానికి, ట్వీటుపెట్టడానికి
ఒంటరిగా నిలబెట్టి
ఒంటరి సమాజం
పద్ధతిలేని వ్యవస్థ
ఆబగా కలవడం
నగరగర్భంలో
అపరిచయిస్తుల్లా
వారి అద్దంలో నీ ప్రతిబింబం
నేర్చుకున్న చేతకానితనం
నడవడులు అలవాట్లు
లక్ష్యం నిర్దేశం అన్నీ వదిలేసి
చుట్టరికాలు వట్టిపోయి
ఇలాంటి జనాలముందు ఓడిపోయి ఓర్వలేను
గుంపులో విమర్శలు
జట్టుకట్టడాలు
రట్టుపెట్టడాలు
వృత్తాల్లో వృత్తాల్లా గిరి గీసుకోవడాలు
మూడో మనిషికి చోటు లేకుండా
నీకు చెప్పకుండా ఉంటానని అనడం అస్పష్టం
నిజం తెలుసుకోవడం కోసం
విమర్శ వ్యక్తపరచాలి గదా
సమాధానం చెప్పని సమాధానమేంటో
గాలిని చదివి చూడు
క్షమించు మరి
నాకు గుర్తు లేదు
నిజం పుట్టిన తరువాత పుట్టాను నేను
ఏదో పాత్ర ధరించాలి నేను
నమ్మాలి నేను, నమ్మినట్లు చూడాలి నేను
అద్దంలో ప్రతిబింబించినట్లు
కల్పితవార్తలకిక శెలవు
నువ్వేంచూశావో నే చెప్తా విను
తిండానికి మరీ తీపిగా పెడ్తాను నేను
మోసపెట్టడానికి, ట్వీటుపెట్టడానికి