ఓ సుందరీ సుందరీ!
ఓ సుందరీ సుందరీ, నేను చుట్టూ అంతా తిరుగుతున్నాను
నాకవి మనశ్శాంతినివ్వట్లేదు, కనికరించట్లేదు
దహించే నీ కళ్ళు, నీ కళ్ళు
నాకవి మనశ్శాంతినివ్వట్లేదు, కనికరించట్లేదు
దహించే నీ కళ్ళు, నీ కళ్ళు
సుందరీ, నీ గుండె రాతైవుండవచ్చు
నన్నెందుకు వేదిస్తున్నావు? పశ్చాత్తాపం లేదా?
నేను కూడా, దహించే అగ్ని కప్పెడుతోంది నన్ను
నీ కళ్ళదే పూచీ, నీ కళ్ళు
నాకవి మనశ్శాంతినివ్వట్లేదు, కనికరించట్లేదు
దహించే నీ కళ్ళు, నీ కళ్ళు
నా తలపులు నీకు అందవు,
నా పలుకులు నీకు అందవు, దూరంగా ఉన్నావు
నేనీ ప్రపంచం ఇలా వదలాలనుకోవట్లేదు
నేనెంతగా నిన్ను ప్రేమిస్తున్నానో నీకు తెలియకుండా
ఎంతగా, ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నానో!
ఓ సుందరీ సుందరీ, నేను చుట్టూ అంతా తిరుగుతున్నాను
నాకవి మనశ్శాంతినివ్వట్లేదు, కనికరించట్లేదు
దహించే నీ కళ్ళు, నీ కళ్ళు
నాకవి మనశ్శాంతినివ్వట్లేదు, కనికరించట్లేదు
దహించే నీ కళ్ళు, నీ కళ్ళు
“అఖ్ తుర్పావ్ తుర్పావ్” అనే ఈ జార్జియాదేశపు జానపదగీతాన్ని పాడింది “త్రియో మందిలీ”అనే గాయనీబృందం. ఈ ముగ్గురు అమ్మాయిలు యూట్యూబులో పందూరి అనే వాయిద్యసహితంగా జానపదగీతాలను ఆలపించి ఎందరో అభిమానులను చేగొన్నారు.