రాత్రి నట్టనడుమున
నడిరాత్రిన వింటున్నా గాలిని
ఇంటిచివారున ఊలవేస్తోంది
నడిరాత్రిన వింటున్నా గాలిని
ఇంటిచివారున ఊలవేస్తోంది
(పల్లవి) :
గాలీ, మెత్తటి గాలీ, వీస్తూ రావే
ఈ నేల కొట్టుకుంటోంది వడివడిగా
త్వరగా పాడు మాకోసం స్వేచ్ఛాగీతాన్ని
గాలి, తూరుపునుండి వీస్తోంది
ఇంటిచివారున ఈలవేస్తూ
గాలి, తూరుపునుండి వీస్తోంది
ఇంటిచివారున ఈలవేస్తూ
(పల్లవి)
గాలి, పశ్చిమంనుండి వీస్తోంది
ఇంటిచివారున ఈలవేస్తూ
గాలి, పశ్చిమంనుండి వీస్తోంది
ఇంటిచివారున ఈలవేస్తూ
(పల్లవి)
గాలి, నేలపైనుండి వీస్తోంది
ఇంటిచివారున ఈలవేస్తూ
గాలి, నేలపైనుండి వీస్తోంది
ఇంటిచివారున ఈలవేస్తూ
(పల్లవి)
గాలి, కడలిపైనుండి వీస్తోంది
ఇంటిచివారున ఈలవేస్తూ
గాలి, కడలిపైనుండి వీస్తోంది
ఇంటిచివారున ఈలవేస్తూ
(పల్లవి)
ఎటునుండి వీస్తే ఏమిటి గాలి
మా ఇంట్లో ఆహ్లాదం తెస్తోంది
ఎటునుండి వీస్తే ఏమిటి గాలి
మా ఇంట్లో ఆహ్లాదం తెస్తోంది
యువెన్ గ్వెర్నిగ్ అను బ్రెతాజ్ఞ్ గాయకుడు బ్రయిఝ్ భాషలోపాడిన “ఏ క్రైజ్ అన్ నోజ్” అను జానపదగీతం ఇది. ఫ్రాన్సుదేశానికి వాయువ్యదిశలో ఉన్న బ్రెతాజ్ఞ్ ప్రాంతంలో సముద్రపుగాలి విపరీతంగా వీస్తూ ఊలవేస్తూ ఉంటుంది. రాత్రిపూట కిటికీలకు వారగా ఇలా గాలి ఊలవెయ్యడం సహజంగా వినపడుతూ ఉంటుంది. నేను బ్రెతాజ్ఞ్ ప్రాంతంలో నివశించిన రోజుల్లో చాలా గాఢమైన జ్ఞాపకం అది. అక్కడి ప్రజలకు గాలితోను, సముద్రంతోను అతిదగ్గర సంబంధం ఉంటుంది. ఈ జానపదగీతం అది నెమరువేసుకుంటూ, గాలి ప్రజలకి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు తేవాలని చెబుతోంది.పాట