మంత్రవశం
మంత్రవశమై, పడున్నా నేను పడున్నా నేను
పట్టి మాంత్రికుడు, పడేసాడు నన్ను పడేసాడు నన్ను
మంత్రవశమై పడున్నా, మనసు లోతుల్లో, మనసు లోతుల్లో
మండుతోంది హృదయంలో, చిటపట అగ్ని చిటపట అగ్ని
మంత్రవశమై, పడున్నా నేను పడున్నా నేను
పట్టి మాంత్రికుడు, పడేసాడు నన్ను పడేసాడు నన్ను
మంత్రవశమై పడున్నా, గుండె వేర్లలో, గుండె వేర్లలో
నా కనుచూపు నించుంది, మాంత్రికుడు ఎక్కడ నించున్నాడో
ఐఫోర్ పాలాస్దోతిర్ అను గాయని ఫారోవేస్ భాషలో పాడిన “ట్రొల్లాబుండిన్” (మంత్రవశమై పడున్నా) అను పాట ఇది. ఫారోవేస్ భాషను ఉత్తర ఐరోపా ఖండంలో ఆర్కిటిక్ మహాసముద్రానికి ఆనుకుని, నార్వే ఐస్లాండు దేశాలకు నడుమున ఉన్న ఫారో ద్వీపాలు అను ద్వీపసముదాయంలో మాట్లాడుతారు. ఈ ఫారో ద్వీపాలు డెన్మార్కు దేశానికి చెందినవి. ఈ ఫారోవేస్ భాష నార్వే, ఐస్లాండు మొదలైన దేశాలకి చెందిన నార్సు (ఔత్తరేయ) భాషాసముదాయంలో ఒక భాగం. ఈ పాట సంగీతం మధ్యలో గాయని కంఠకంపన ఆలాపన కూడా చేస్తోంది. ఇటువంటి కంఠకంపనగానం ఇన్యూవిట్ మొదలైన ఆర్కిటిక్ మంచుప్రాంతపు తెగలవారు వారి జానపదసంగీతంలో ఉపయోగిస్తారు.