పాడు ముందు, అన్నయ్యకి చెల్లెలా
పాడు ముందు, అన్నయ్యకి చెల్లెలా
సాగదీసి పాడు, మడిచిపెట్టి పాడు
నీకు అలవాటైపోయింది
అన్నదమ్ములతో కలిసుండగా
ఒక కొండ ఎక్కేదానిని నేను
ఒక లోయ దిగేదానిని నేను
కొండపైన పూస్తుందొక తెల్లటి పండు
లోయలో పారుతుందొక జడైన నది
కొండెక్కి నన్ను సింగారించుకుంటాను
లోయలో దిగి ఒళ్ళు కడుక్కుంటాను
పాడు ముందు, అన్నయ్యకి చెల్లెలా
సాగదీసి పాడు, మడిచిపెట్టి పాడు
లాట్వియాకి చెందిన తౌతూమెయితాస్ గాయనీబృందం “ఔలి” అను సాంప్రదాయక జానపదసంగీతబృందంతో కలిసి ఆలపించిన “జీద్ పాప్రీస్కు, బ్రాలా మాసా” (పాడు ముందు, అన్నయ్యకి చెల్లెలా) అను పాట ఇది. పాట మధ్యలో బూరాలు, డప్పులతో కూడిన సంప్రదాయక లాట్వియా సంగీతం వినవచ్చు. పాట సాహిత్యం నేను ఆంగ్ల అనువాదం ద్వారా తెలుగులోకి అనువదించాను. జానపదసంస్కృతి మూలాలని అందరు కలిసి పోషించుకోవాలని ఈ పాట లీలగా ప్రస్తావిస్తోంది.