నోరుపో దేవతావంశవృక్షం

నోరుపో దేవతావంశవృక్షం

ఫే: ధనం తెగ మధ్య తగువులకు మూలం, తోడేలు అడవిలో నివశిస్తుంది
ఉర్: తుప్పు హీనమైన ఇనుముపై పుడుతుంది, కొమ్ములేడి మంచుపై పరిగెడుతుంది
థుర్స్: బలశాలి ఆడవారికి బాధ కలిగిస్తాడు, దౌర్భాగ్యం ప్రజలకి క్షోభ చేస్తుంది
ఆస్: ఉప్పుకయ్య ప్రయాణాలన్నింటికి దారి, ఒర కత్తులతో నిండుంటుంది
రైధ్: స్వారీ గుఱ్ఱాలకి కష్టమైనది, రెగిన్ అతిపదునైన కత్తి సాగకొట్టాడు
కౌన్: పుండ్లు పిల్లలకి విషమమైనవి, మృత్యువు శవాన్ని తెల్లబారుస్తుంది
హగల్: వడగళ్ళు అతిచల్లటి విత్తనాలు, హెర్యాన్ పురాతనలోకం సృష్టించాడు
నౌధృ: అవసరం ఎంపికలు వెదకదు, నగ్నమైన మనిషి చలికి వణుకుతాడు

ఈస: మంచుబల్లలని వంతెనలంటాం, గుడ్డివాళ్ళని పట్టుకు తీసుకెళ్ళాలి
ఆర్: సమృద్ధి మనుషులకి వరం. ఫ్రోడీ దయాగుణం నిండినవాడు
సోల్: సూర్యుడు ప్రపంచానికి వెలుతురు. నేను దైవాజ్ఞకి తలవంచుతాను
ట్యుర్: ఒక చేయి కలిగిన దేవత. కుమ్మరి తరుచుగా ఊదాలి

బ్యార్కాన్: భుర్జవృక్షం ఆకులు అతిపచ్చవి. లోకీ వంచనలో అదృష్టవంతుడు
మధృ: మనిషి ధూళికి తోడు. డేగ గోరు గొప్పది
లోగృ: జలపాతం పర్వతంపై జాలువారు నది, కానీ తన నగలు బంగారం
యుర్: జనకవృక్షం శీతాకాలంలో పచ్చగా ఉంటుంది. మండేటప్పుడు చిటపట్లాడదు

ఐరోపాఖండానికి ఉత్తరాన ఒకానొక కాలంలో జానపదులు మాట్లాడిన పురాతన నార్సుభాషలో ఆధునికయుగంలో తిరిగి గేయరచన చేయాలని సంకల్పించి కొన్ని గాయకబృందాలు కృషిచేస్తున్నాయి. అందులో హైలుంగ్ (స్వస్థీకరణ) అను సంగీతబృందం పాడిన “నోరుపో” అను ఒక స్వస్థీకరణ గీతం ఇది. షమానులు అనే ప్రాకృతికమతానికి చెందిన మంత్రగాళ్ళు కృశించిన, రోగాలబారిన పడిన ప్రజలను స్వస్థపరచడానికి వివిధ దేవతల పేరులు, వారి మహిమలు చెబుతూ, మంత్రాలు వల్లిస్తారు. ఈ వైనం ఇక్కడి ఆధునిక యుగంలో తిరిగి పునస్థాపించడానికి ఒక ఉదాహరణగా ఈ పాట చెప్పవచ్చు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s