కంకుల రోజా గుత్తీలో

కంకుల రోజా గుత్తీలో

కంకుల రోజా గుత్తీలో, ఎవరే బయట నడుస్తోంది, గుమ్మోయి చిమ్మ
కంకుల రోజా గుత్తీలో, నడుస్తోంది కోడె కుర్రోడే, గుమ్మోయి చిమ్మ
కంకుల రోజా గుత్తీలో, మరే ఏంటే చూస్తున్నాడే, గుమ్మోయి చిమ్మ
కంకుల రోజా గుత్తీలో, వాడి కళ్ళన్నీ ఓ కన్నెపిల్లపైనే, గుమ్మోయి చిమ్మ
కంకుల రోజా గుత్తీలో, అదిగదిగో ఆ గుమ్మని కలిసాడే, గుమ్మోయి చిమ్మ
కంకుల రోజా గుత్తీలో, తను పచ్చగడ్డిని కోసి పోగుచేస్తోంటే, గుమ్మోయి చిమ్మ
కంకుల రోజా గుత్తీలో, దేవుడు ఆ పిల్లని చల్లగ చూడాలే, గుమ్మోయి చిమ్మ

స్యుతర్తీన్యె అనే ఈ జానపద పాటలు లిథువానియా దేశానికి చెందిన సంప్రదాయాలు. విడివిడిగా పదాలను పాడుతూ ఉంటే కలిసి సంగీటం రప్పించే ఈ తతంగాన్ని బహుళయుగళగానం అంటారు. ఈ పాటలు మంత్రోచ్ఛారణలవలే ఒక సమ్మోహనమైన నాదాన్ని కలిగి ఉంటాయి. పాడుతున్న గాయకులు, వింటున్న ప్రేక్షకులు అందరూ అలలవలే వస్తున్న ఈ శబ్దాలతో మైమరచిపోతారు. ఈ బహుళయుగళగీతాలని యునెస్కోవారు ప్రపంచ మానవ వారసత్వమని గుర్తించి గౌరవించారు. లిథువానియా దేశంతోపాటు పక్కన ఉన్న లాట్వియాదేశంలో కూడా ఈ పాటలు పాడడం రివాజు. లిథువానియా పశ్చిమప్రాంతంలో ఉన్న జెమ్మాతియాలో (సమోగితియా) అతిప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ స్యుతర్త్యీనే గీతాలతో పాటు అనేక రీతులుగా ఉన్న ఈ జానపదగానరీతులను కలిసికట్టుగా “దైనా” అని వ్యవహరిస్తారు.

లిథువానియా దేశపు సంస్కృతి నిన్న బ్లాగులో పరిచయంచేసిన లాట్వియా దేశానికి పోలివుంటుంది. ఈ దేశం ఐరోపాఖండంలో అన్ని దేశాలలోనూ అతివిలంబితంగా క్రైస్తవీకరణమయ్యింది. కనుక, సంస్కృతిలో ఇప్పటికీ కూడా ప్రకృత్యారాధనా వైఖరులు గోచరమౌతూ ఉంటాయి. అదే ఈ జానపదపాటలలో కూడా ప్రతిబింబిస్తూ ఉంటుంది.

“కంకుల రోజా గుత్తీలో” అని నేను అనువాదం చేసిన పాట లిథువానియా భాషలో “కూకల్ రోజే రత్తీలో” అని ఉంది. ఇది ఒక ఊతపదంగా పాటకి ఊతనిస్తోంది. పల్లెటూళ్ళలో ఊడ్పులు ఊడ్చేటప్పుడు, పంటకోతలు కోసేటప్పుడు గ్రామీణులు ఇటువంటి పాటలు పాడడం మనకు ఎరుకే. పాటలో ప్రతి వాక్యం ఇలగే మొదలవుతుంది. ఈ ఊతవాక్యాన్ని ఒక గాయని పాడుతూ ఉండగానే, మధ్యలోనే రెండవ గాయని పాటలో మధ్య వాక్యాన్ని పాడుతుంది. ఈ మధ్యవాక్యం మాత్రం ప్రతి అంకానికి వేరుగా ఉంటుంది. ఇది ఒక యువతీ యువకుల కలయికను, ప్రేమకథను చెప్తుంది. ఇదికాక, చివరన మూడో వాక్యం కూడా ఊతగా ప్రతి అంకంలోనూ కొనసాగుతుంది. “గుమ్మోయి చిమ్మ” అని నేను అనువదించిన ఈ వాక్యం లిథువానియా భాషలో “లియోయ్ తూతా” (లియోజ్ మూతి) అని ఉంది. దీనికి భావమేమీ ఉండదు, కేవలం ఊతగా సంగీతసహకారం ఇస్తుంది. ఇలా మూడు గాయనిలు తమ గళాలని కలిపి సంయుక్తనాదమైన సంగీతం కల్పిస్తారు. ఇలాంటి సంగీతాన్ని పురాతనకాలం నుండి ప్రకృతి ఆరాధనలో క్రతువులకి, జానపద ఉత్సవాలకీ వాడుతున్నారు.

One response to “కంకుల రోజా గుత్తీలో

  1. పింగుబ్యాకు: ఋతుచక్రాలోయి | తేట తెలుగు - తేనె వంటి తెలుగు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s