ఋతుచక్రాలోయి

ఋతుచక్రాలోయి ఋతుచక్రాలోయి
… పృథులతావృక్షానికి …
… తొమ్మిది కొమ్మలున్నాయి …
… పుట్టిపెంచిన తల్లికి …
… తొమ్మిది కూతుళ్ళున్నారు …
… ఆ తొమ్మిది కొమ్మలనీ …
… పెడువాన తెంచివేసింది …
… ఆ తొమ్మిది కూతుళ్ళకీ …
… పెళ్ళిపెద్ద జోడు చూసాడు …
… మమ్మళ్నొదిలెయ్యండి …
… కోకిల ఎగిరొచ్చేందుకు …
… మమ్మళ్నొదిలెయ్యండి …
… ఈ మట్టినేలని తుడిచేందుకు …
… కోయిల ఎగిరొచ్చేందుకు …
… కోయిల తన పాట కూసేందుకు …
… ఋతుచక్రాలోయి ఋతుచక్రాలోయి …

లిథువానియా దేశానికి చెందిన మరొక జానపద బహుళయుగళ గానమిది. ఈ వీడియోలో ఈ పాటలు పాడుతున్నపుడు మనసులు కలిసిమెలిసి పోయి పొందే హాయిని చాలా అందంగా చూపించారు. ఆధునికకాలంలో వృత్తివ్యాపకాలతో ఎంతో హడావుడిగా ఉండే మహిళలు కూడా, ప్రవృత్తిగా ఈ పాటలు పాడడానికి కలుస్తూ, ఒకరితోనొకరు తోడుజోడుగా ఉండే భావాన్ని, ఆడవారిమధ్య సాన్నిహిత్యాన్ని పొందుతున్నారు. పురాతనకాలంనాటి ఈ జానపదగీతాలలో ఏదో బలమైన భావం ఉందని, ఆ భావం ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్తుందని, పూర్వీకుల నిర్మల హృదయాల వద్దకు తీసుకెళ్తుందని ఈ పాటలో చాలా చక్కగా చూపించారు. క్రింద వీడియోలో పాట పాడుతున్న గాయనుల దైనికజీవనం, అందునుండి ఈ బహుళయుగళగానం కోసం కలవడం ఎలా ఉపసమనం చూపుతుందో కథలాగ చూపించారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s