తెలంగాణా ఆంధ్రా తస్సాదియ్య డిస్కో

ఈ మధ్యన నా పీ.హెచ్.డి పనిలో బిజీగా ఉండి బ్లాగు వ్రాయడం కుదరట్లేదు..

ఈ రెండు మూడు వారాలూ.. తెలంగాణా, సమైక్యాంధ్ర గొడవలు చూసి ఒక బ్లాగు బ్లాగాలనిపించింది.. కానీ, ఏమి వ్రాయడం ? అందరు పోలిటిషన్లు కంత్రీలు.. దద్దమ్మలు. వీళ్ళని తలుచుకుంటే బీ.పీ పెరగడం తప్ప ప్రయోజనం ఉండదు.. ప్రజాస్వామ్యం అన్న తరువాత ప్రతీ పార్టీకి ఒక ప్రణాళిక ఉండాలి. ఒకళ్ళకు ఒకళ్ళు పడనప్పుడు కనీసం నమస్తే చెప్పుకునే సంస్కారం.. వివాదాలను సామరస్యంగా చర్చించుకోవడం కావాలి.. దీనికి కొంత ఓపిక, నిబద్ధత ఉండాలి.

ఇదేమీ లేకుండా బందులు, రాజినామాలు, నిరాహారదీక్షలు, ఆత్మహత్యలు, హత్యలు.. ఏంటి ఈ సినిమా ?

పరమానందయ్య శిష్యులు లా మన పోలిటీషన్లు ఇలా సరిగమలు పలికిస్తుంటే, ఇక పరమానందయ్య గారు (అదేనండి గవర్నరు) వారి శృంగార సౌధంలో పదనిసలు వాయుస్తున్నారు..

ఈ రోజు బోరుకొట్టి సరదాగా యూట్యూబులో సంచరిస్తుంటే ఒక వీడియో దొరికింది. పదిహేనేళ్ళ క్రితం సినిమా.. అప్పట్లో తెలంగాణా విజయశాంతి, ఆంధ్రా చిరంజీవి ఓ మాంచి స్టెప్పు వేసుకున్నారు.. మనం ఒక స్టేటు లో ఉన్నా, రెండు స్టేట్లలో ఉన్నా.. భవిష్యత్తులో కూడా మన మధ్య సంబంధాలు ఇలాగే తస్సాదియ్య డిస్కోలా ఉండాలని నా మనవి..

ప్రకటనలు

2 responses to “తెలంగాణా ఆంధ్రా తస్సాదియ్య డిస్కో

 1. తేనె వంటిదీ మన తెలుగు కదా
  మరి-చే-దెలా అయ్యింది మాతృభాష-మన మాతృభాష
  అమ్మ అంటెనే హాయి కదా
  ’మమ్మీ’ అనుమాటలో ప్రేతమనీ తోచదా
  కన్నతల్లి కన్నమిన్న ఇంకేది లోకాన
  సొంతఊరు అవ్వనుడుగు సాటిలేనివెపుడైనా
  1. క్షరము కానిదే అక్షరము కదా
  కొఱవడుతున్నాయెలా క్ష ఱ లు
  సమసిపోనిదే వర్ణం కదా
  లుప్తమెలా అయ్యాయి ళు ళూలు (ఈ ఉఛ్ఛారణతో ఉండే అచ్చులు)
  ఇంద్ర ధనుసు కున్నవి ఏడే వర్ణాలు
  తెలుగు భాష వర్ణాలు యాభయ్యారు
  2. ఋణములు,ౠకలు నిత్యాగత్యమే కదా
  మాయమెలా అయ్యాయి ఋ,ౠలు
  మనఃపూర్వకంగా తెనుఁగు అనాలన్నా
  అవసరమవుతాయికదా అరసున్నా విసర్గలు
  భిన్నమైన యాసలే తెలుగు గర్వకారణం
  ముత్యాల దస్తూరే తెలుగులిపికి ఆభరణం
  3. అచ్చరువొందే అచ్చరాలే
  అచ్చతెనుఁగుకే మెచ్చుతునకలు
  దేశభాషల్లో తెలుగులెస్సగా
  రాయలపలుకులే జిలుగు కణికలు
  నిలపాలి మనమెప్పుడు తెలుగు ఆత్మగౌరవము
  గుర్తెరిగీ మసలాలి తెలుగు భాష గొప్పదనం
  తూర్పులోని ఇటలిభాషగ కీర్తించెను ప్రపంచం

  రాఖీ-ధర్మపురి

 2. ఒక పని చెయ్యండి సార్ ,పి.హెచ్.డి థీం కు యీ సబ్జెక్ట్ ఎంచుకోండి.సబ్జెక్ట్ రెడ్య్ మేడ్. అన్ని కలర్స్ కలిసి వుంటాయి……అభినందనలతో ……నూతక్కి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s