కుతూహలమ్మ ద్రౌపదియా, శిఖండినా ?

శాసన సభలో జరుగుతున్న వీర తమాషా మరో అంకంపైకి వచ్చింది. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం అంటూ ఒక డ్రామా మొదలుపెట్టారు. సరుకు తక్కువ, సణుగుడు ఎక్కువ – సభంతా గోల గోల అయ్యింది. ఒకరినొకరు బూతులు తిట్టుకోవడం, చొక్కాలు చించుకోవడమే తరువాయి, మిగిలిందంతా ముగించారు. “స్పీకర్ వచ్చే వరకు సభ జరపనివ్వం. డెప్యూటీ స్పీకర్కి సభ నిర్వహించే హక్కు లేదు”, అంటు చంద్రబాబు ఏదో లా పాయింట్లు లేవనెత్తాడు. డెప్యూటీ స్పీకర్ కుతూహలమ్మగారు దళిత మహిళ అయినందువల్ల, కాంగ్రెసువాళ్ళకి ఒక మంచి అవకాశం దొరికింది. “ఉత్సవ విగ్రహం లాంటి కుతూహలమ్మనే అవమానిస్తావా ? కులహంకారి”, అంటూ విరుచుకుపడ్డారు. “తేడా వచ్చిందిరో అబ్బాయ్”, అంటూ తెలుగుదేశం వాళ్ళు వెనక్కి తగ్గారు.

“కౌరవ సభలో ద్రౌపదిలా ఫీల్ అయ్యాను”, అంటూ కుతూహలమ్మ కొసమెరుపు. కానీ, కౌరవసభలో మెజారిటీ కౌరవులది, ఇక్కడ శాసనసభలో మెజారిటీ ఎవ్వరిదో ? సరైన పోలిక ద్రౌపదితో కాదు, శిఖండితో. భీష్ముడిని ఎదుర్కోలేక అడ్డుగా శిఖండిని పెట్టుకుని యుద్ధం చేస్తారు పాండవులు. ఒకప్పటి ఆడది అయిన శిఖండితో పోరు చెయ్యలేక భీష్ముడు విల్లు విడుస్తాడు. ఇక్కడ, మన భారతదేశంలో దళితుల విలువ శిఖండికి సమానంగా జమకట్టారు మన రాజకీయనాయకులు. ఎవ్వరూ వీరితో పోరుపెట్టుకోరాదు. ఇది రూలు.

దళితుల ఆత్మగౌరువం రక్షించే పనులా ఇవి !!? అసలు పవరు ఏ కులాల మధ్యన ఉందో అందరికీ తెలుసు. ఈ కామెడీ జనాలు అర్థం చేసుకోలేరా ?

ప్రకటనలు

5 responses to “కుతూహలమ్మ ద్రౌపదియా, శిఖండినా ?

  1. నిజంగా ఆలోచించాల్సిన విషయం. సెన్సిటివ్ పాయింటుని సమర్ధంగా చిత్రించారు

  2. నిజమే మాస్టారు! అర్ధం ఐతే మీరు బ్లాగ నేలా, ప్రజ – ఆ తమషాని దేఖ నేల!

  3. చాలా చక్కగా చెప్పారు..ఇక్కడ నాకు యెప్పటకి అర్ధం కానిది, కాబోనిది ఒక సమస్య వుంది మిత్రమా?? ఆమె దలితురాలు కాబట్టే యిలా అన్నారు అని అంటారు.. యిల దళితులం దళితులం అని ఎందుకు ఎప్పుడు వాళ్ళని అలా అవమానపరుస్తున్నరో యి స్వర్ధ రాజకీయ నాయకులు కె తెలియాలి.. మనం బారతీయులం అని చెప్పుకునె రొజులు ఎప్పుడు వస్తాయో.. యిది అంతా ఒక రాజకీయ డ్రామా..నిన్న కాంగ్రెస్ వల్ల ప్లేస్ లొ టిడిపి వాళ్ళు వున్నా యిలానె చెసే వాళ్ళు.. అందుకే దేశం లో దొంగలు పడ్డారు ఫ్రెండ్స్…

  4. దేశానికి ఎడంగా వున్నాను, అసలు రాజకీయాలమీద శ్రద్ధ లేదు. అయినా మీశైలి మూలంగా చదివేను. అద్భుతంగా చిత్రించారు. నిజానికి పురాణాల పాత్ర మననిత్యజీవితాల్లో అదే. విషయం తప్పక ఆలోచించవలసిందే. థాంక్స్.

  5. ఏదో రాద్దామనుకున్నాను..కానీ!! కిరణ్ బాగా రాసావ్..
    ఐతే పల్లెల్లో, ఒకమోస్తరి పట్టణాలలో దళితుల, వెనకబడిన కులాల బతుకులు ఘోరంగా ఉన్నాయి. ఏది ఏమైనా మనం ఉన్న కొంచెం సామాజిక సృహని కూడా కోల్పోతున్నాం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s