జాత్యహంకారి ఉండవల్లి

బుర్ర ఉన్న రాజకీయవేత్త ఎవ్వడైనా అంబేద్కర్కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తాడా !? అందులోనూ, రామోజీరావుకే హడలుపెట్టించిన ఉండవల్లి లాంటి ఉద్ధండుడు ఇంతటి వెర్రి పని ఎందుకు చేస్తాడు ? పైగా, పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలో గనక ఒకటికి నాలుగుసార్లు వెనకా ముందూ చూసుకోవాలి, ఇలాంటి ప్రకటనలు చేసే ముందు. ఉండవల్లికి అలాగ మాట్లాడే ఉద్దేశ్యం ఇసుమంతైనా ఉండదు. లోలోపల దళితులపై ప్రేమ ఉన్నా, అసహ్యమున్నా పైకి మాత్రం మల్లెలంత మృధువుగా మాట్లాడడం ఆయన అస్థిత్వానికి అవసరం. మరి ఇలాంటి దిక్కుమాలిన స్థితిలోకి ఎలా ఇరుక్కుంటాడు ?

జరిగిందేమిటంటే, ఆయన వ్యాఖ్యలని ఈనాడు పత్రిక అమోఘంగా వక్రీకరించింది. “రాజ్యాంగం రచించడం అయిపోయింది. మేము అంతా రాజ్యాంగానికి అనుగుణంగానే చేస్తున్నాం, అది మీ దురదృష్టం” అని అనాల్సింది పోయి, “దురదృష్టవశాత్తు అంబేద్కర్ రాజ్యాంగం రచించాడు, దానికి అనుగుణంగానే మేం చేశాం” అన్నాడు. పప్పులో కాలేసాడు. భలే భలే !

అసలు, అంబేద్కర్ పేరుని వాడాలంటే, చదరంగం మల్లే ఎత్తులు-పైయెత్తులు ఉపయోగించి అప్పుడు వాడాలి. మన ప్రజాస్వామ్యంలో భావ స్వేచ్ఛ ఉన్నది పేరుకి మాత్రమే. చాలా పదాలు నిషిద్ధాలు – ఆచి తూచి మాట్లాడాలి. నిజాము/ముస్లిము/దళితులు/అంబేద్కరు/జిన్నా/… ఇలా లెక్కకు మిక్కిలి. ఏమన్నా తప్పుగా నోటినుంచి దొర్లితే, దిష్టిబొమ్మలు దహనం చెయ్యడానికి రెడీగా వీధుల్లో ఉంటారు మనదేశంలో, పనీపాటాలేని దేశభక్తులు.

మొత్తం మీద కొంచెం కామెడీ లభించింది జనాలకి :))

————————————————————————-

కామెడీ అనుకున్నా, అంతవరకూ బానే ఉంది. కానీ, జరుగుతున్న అల్లర్ల వైఖరి చూస్తుంటే నిజంగా సిగ్గేస్తోంది. అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇటు కాంగ్రెస్సు లోనే వెనక నుండి పొడిచేందుకు రెడీగా ఉన్న అమలాపురం హర్షకుమార్ లాంటి వాళ్ళు దీన్ని భీకరంగా రాజకీయం చేస్తున్నారు.

 1. అంబేద్కర్ పై విమర్శలు చేస్తే ఆటోమెటిగ్గా దళితులకి వ్యతిరేకుడైపోతాడా ? దళితులకి అన్యాయం చేస్తున్న అసలు పెద్దమనుషులు ఎవరు ? అంబేద్కర్ నెత్తి మీద పాలు చిలకరించినంత మాత్రాన దళిత-బాంధవులైపోతారా ? ఏవో రెండు పథకాలకి అంబేద్కర్ పేరు పెట్టినంత మాత్రాన దళితులని ఉద్ధరించినట్లా ?
 2. దేశప్రజలు నిజంగా ఇంత వెర్రివాళ్ళు అని భావిస్తున్నారా మన రాజకీయనాయకులు ? అసలు ఫ్యూడల్ పద్ధతిలో ఆలోచిస్తున్నదెవరు ?
 3. సరే అంబేద్కర్ని విమర్శించాడనే అనుకుందాం. కానీ, ఎం.పి పదవికి రాజీనామా ఎందుకు చెయ్యాలి ? ఈ విధమైన డిమాండు చెయ్యడంలో అర్థం ఏమిటి ? ఇటువంటి డిమాండు మరేదేశంలోనైనా (అమెరికా, ఇంగ్లాండు, జపాను..) ఎవ్వరైనా చెయ్యగలరా ? ప్రజా ప్రతినిధులకు భావ స్వాతంత్ర్యం లేదా మన భారతదేశంలో ? ప్రజాస్వామ్యం అంటే అసలు అర్థం ఏమిటి ?
 4. తెలుగుదేశం వాళ్ళు మూతులకి నల్లటి తొడుగులు ధరించి ఊరేగింపు చెయ్యడం ఏమిటి !? వీళ్ళ నోర్లు ఎవరన్నా నొక్కేసారా ? జరిగిందంతా రివర్సులో కదా.
 5. దళిత ఉద్యమాల్లో పనిచేస్తున్న మేధావులందరూ ఒకసారి సద్విమర్శ చేసుకోవాలి. స్వాతంత్ర్యం వచ్చిన 50 ఏళ్ళకు కూడా మీరు దళితల బ్రతుకుల్లో ఎందుకని ఏమీ మార్పూ తీసుకురాలేకపోతున్నారు ? అంబేద్కర్కి వారసులమని గుండె మీద చెయ్యవేసుకుని చెప్పుకోగలరా ?
 6. దేశ జనాభాలో 15% శాతం ప్రజలకి అంబేద్కర్ మించి ఒక ఆరాథ్యుడు / మార్గదర్శి లేడా ? దళిత రచయితలు, కళాకారులు, శాస్త్రవేత్తలు – వీరిలో ఎంతమందికి విగ్రహాలు కట్టించారు, పాలాభిషేకాలు చేస్తున్నారు ? ఒక మహాసముద్రం లాంటి ప్రజానీకాన్ని ఇలాగ ఒక మనిషితో స్టీరియోటైపు చెయ్యడం ఎంతవరకు సమంజసం ? ఈ స్టిరియోటైపు మించి ఆలోచించలేని వారా మనకు నాయకులు ?
 7. ప్రజలు నిజంగా అంత మొద్దులని భావిస్తున్నారా మన నాయకులు ? కొంత కళ్ళు తెరిచి చూడడం మంచిది. దేశం మారుతోంది. ప్రజలు విద్యావంతులవుతున్నారు. మనం మరో యుగంలో ఉన్నాం. వందేళ్ళ కిందటి ఫ్యూడల్ మనస్తత్వాలతో రాజకీయం నడపడం ఇప్పుడు చేతనవదు. కొంత, వళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడడం మంచిది.

9 responses to “జాత్యహంకారి ఉండవల్లి

 1. ఇదో పెద్ద జాడ్యంగా తయారయింది. రాజ్యాంగాన్నే తుంగలో తొక్కెయ్యొచ్చు గానీ దానిని రాసిన వారిని ఏమనుకూడదు. అసలు రాజ్యాంగాన్ని మొత్తం అంబేద్కర్ ఒక్కరే రాయలేదే? నాకైతే మన రాజ్యాంగం బ్రిటీష్ రాజ్యంగానికి జిరాక్స్ తీసి అక్కడక్కడా మార్చారనిపిస్తుంది.
  జై హింద్.

 2. సద్దాం లాంటి వెధవకు హారతులు పట్టి, కవితలు రాసిన దేశ భక్తులున్నారీ దేశం లో. వాడు జెనోసైడ్ చేసినా పర్వాలేదు మన శత్రువుకు శత్రువా కాదా? అని చూడడం వెధవత్వం, దిక్కుమాలినతనం కాక ఇంకేమిటి.

 3. మీకు నిజంగా ఉండవల్లి ఏమన్నాడో తెలుసా. ఈనాడు లేదా మన మీడియా ఎంతవరకు ప్రామాణికం?

 4. ఉండవల్లి తప్పుగా మాట్లాడకపోతే SORRY ఎందుకు చెప్పినట్లో ??

 5. పింగుబ్యాకు: పొద్దు » Blog Archive » 2008 ఫిబ్రవరి బ్లాగోగులు

 6. @KRISHNA RAO JALLIPALLI: పొలిటికల్లి కరెక్ట్ స్టేట్‌మెంట్ కాబట్టి!

 7. paina unna ee article rasindhi upper caste ayana ani nenu ghanta pathamga cheppagalanu. kadhante reply ivvandi.

 8. @నవీన్ ఆచారి గారు : కులం పేరు చెప్పి నన్ను అవమానించినందుకు క్షమాపణ చెప్పండి. కులం మీద నా అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ పోస్టు చదవండి. జాతి అనే ఆలోచననే తప్పుబట్టిన ఈ బ్లాగుని చూడండి.

 9. nenu avamaninchatledhu mitrama. just ni rathanu batti nuvvevaro cheppanu. anthe. nenu ninnu thappu anatledhu. correct anatledhu.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s