చిట్టీ చిట్టీ పాపల్లారా

మా నాన్నగారు ఒకప్పుడు కథలు వ్రాసేవారు, ఆ విషయం నాకు పదో తరగతికొచ్చినంత వరకూ తెలియదు. ఒకసారి మా ఇంట్లో పాత అల్మరాలో వెతుకుతుండగా కొన్ని శిథిలావస్థలో ఉన్న వారపత్రికలు కనపడ్డాయి, పాతికేళ్ళ కిందటివి. సరదాగా లోపలేముందో చూద్దామని కథలు చదవడం మొదలుపెట్టాను. మా నాన్నగారి పేరుతో కొన్ని కథలు కనపడ్డాయి – అదే మొదటి సారి చదవటం.

మా నాన్నగారు ఎప్పుడూ మాకు దేని గురించి ఉపన్యాసలివ్వలేదు. తన ఆలోచనలని తనకే అట్టేపెట్టుకునేవారు. “పిల్లలు వారంత వారే ఎదగాలి”, అన్నది ఆయన సిద్ధాంతం.

మా అమ్మా, నాన్న ఇద్దరు స్కూలు టీచర్లు. పొద్దుటే అందరూ స్కూళ్ళకి వెళ్ళే హడావుడిలో తలమునకలై ఉండేవాళ్ళం. ఆ సమయంలో, మా నాన్నగారు చిన్నగా ఈలపాటలు పాడేవారు. ఆ సంగీతం నాకు బాగా గుర్తు. అప్పుడప్పుడు పదాలతో పాటనే పాడేవారు. నాకు గుర్తున్న పాట ఇది

“చిట్టీ చిట్టీ పాపల్లారా
బుల్లి బుల్లీ పూవుల్లారా
మళ్ళి మళ్ళీ నవ్వండర్రా
నవ్వుతూ బతకండర్రా”

తను ఎప్పుడో వ్రాసుకున్న పాట అది. సరదాగా పాడుతూ ఉండేవారు. ఈ పాట మా నాన్నగారే వ్రాసారన్న విషయం కూడా నాకు పెద్దయ్యేంతవరకూ తెలియదు.

“కులం మతమని దేబుర్లాడితే
బతుకేమో గంజాయి మొక్క
మానవత్వమే నా మతం అంటే
మనిషిగా తులసి మొక్క

తెలిసిన విషయం మరచిపోతే
ఆటల్లో అరటిపండు
తెలియని విషయం ఛేదిస్తే
చిలక్కొట్టిన జాంపండు

చిట్టీ చిట్టీ పాపల్లారా
బుల్లి బుల్లీ పూవుల్లా
రా
మళ్ళి మళ్ళీ నవ్వండర్రా
నవ్వుతూ బతకండర్రా ”

ఇదొక్కటే మా నాన్నగారు పాటరూపంలో మాకు తెలియకుండానే ఇచ్చిన సందేశం.

ఇప్పుడు ఇంట్లో మేమెవ్వరం లేక అమ్మ,నాన్నకి చాలా బోరుగా ఉంటోంది. మళ్ళీ కథలు వ్రాయండి అని నేను చెప్పినా మా నాన్నగారు “కష్టం రా, ఇప్పుడంత తీరికా ఓపికా లేవు” అంటున్నారు. ఎప్పటికైనా ఈ బ్లాగులు ఉపయోగించడం నేర్చుకుంటారేమో అని నా ఆశ.

6 responses to “చిట్టీ చిట్టీ పాపల్లారా

 1. ఎక్కడ ఉంటారేమిటి?

  ఓ సారి కలసి ఈ బ్లాగుల గోల చెప్పి వస్తాము

  దండుగా వెళ్ళి మరీ!

 2. థాంక్సు చావాగారు 🙂 కాని, మా అమ్మా నాన్నా ఉండేది తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురంలో. మా అమ్మగారి పేరు ముక్కవిల్లి రాణి, బాలికల హైస్కూలులో ప్రథాన ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. మా నాన్నగారి పేరు వారణాశి వీర సుబ్రహ్మణ్యం. ఇరవై కిలోమీటర్ల అవతల ఇంకో స్కూలులో పనిచేస్తున్నారు. మీరు అలా తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళే ఉద్దేశ్యం ఉంటే చెప్పండి. మా అమ్మానాన్నకి చెప్తాను. బహుశా, వేరే స్కూలు టీచర్లకి కూడా మీరు ఒక క్లాసు ఇవ్వొచ్చు – వికిపీడియా, బ్లాగులు ఎలా ఉపయోగించొచ్చో.

 3. Kiran garu, can I use the first stanzaa for a project on http://www.telugu4kids.com, with credits acknowledging your dad, ofcourse.

 4. లలిత గారు

  మా నాన్నగారితో ఫోనులో మాట్లాడాను, పాటని మీరు ఉపయోగించడానికి సరే అన్నారు. కానీ, పాట మొత్తం ఉపయోగించండి, కొన్ని పదాలే ఉపయోగిస్తే పాటకి న్యాయం చేసినట్టు కాదు కదా. రెండొ చరణం కూడా ఇప్పుడు ఏడ్ చేసాను, మా నాన్నగారికి బాగా ఇష్టమైన చరణం అది ! మొదటిసారి వ్రాసినప్పుడు నేను మరచిపోయాను, కానీ ఇప్పుడు ఫోనులో మా నాన్నగారు గుర్తుచేసారు. చూడండి.

  మీరు మా నాన్నగారి పేరుతో పాటు, వీలైతే ఈ పోస్టుకి కూడా లింకు ఇవ్వండి.

 5. పింగుబ్యాకు: చిట్టీ చిట్టీ పాపల్లారా « ఓనమాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s