సినిమాలలో కూడా కులజాడ్యం

కంప్యూటర్లు ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయిన ఈ యుగంలో, ఆ పెనగలుపు నుండి ఎక్కడి సినిమాలనైను ఎక్కడివారైనా దించుకుని చూసుకోవచ్చు. మన సంస్కృతి, వారి సంస్క్కృతి అన్న అడ్డుగోడలింకేమీ లేవు. నాసిరకం సినిమాలను, సంగీతాన్ని మనదేశంలో చెల్లుబాటు చెయ్యవచ్చు, పిచ్చివాళ్ళవలే కేరింతలు కొట్టే వీర ఫేనులు ఉన్నారు. కానీ ఇదే సరుకుని మిగతా దేశంవాళ్ళ విమర్శలనుండి వేర్పెట్టలేము. ఇది యూట్యూబు యుగం. ఎవ్వడైనా వీడియోలు పెట్టవచ్చు, మరింకెవ్వడైనా వాటిని దిలోడించుకోవచ్చు. ఎలాంటి కామెంట్లైనా పబ్లిగ్గా రాసుకోవచ్చు.

మన చిరంజీవి ప్రస్తుతం యూట్యూబులో మహా పాపులర్ అయ్యివున్నాడు. ఏదన్నా మంచి విషయమా అంటే కాదు. 1980లో ఎప్పుడో దొంగ అనే సినిమాలో మనవాళ్ళు మైఖేల్ జాక్సన్ థ్రిల్లర్ వీడియోని మక్కీకి మక్కీ కాపీ కొట్టారు. బాలసుబ్రహ్మణ్యం పాట పాడేశాడు, చిరంజీవి డాన్సు ఆడేసాడు. వీర ఫేనులు జైజైలు కొట్టేసారు. కానీ, పాతికేళ్ళ తరువాత సీను ఇలా తయారవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇప్పుడు, ఆ వీడియోలో ప్రతీ అడ్డమైనవాడు “భలే ఉంది, చింపాంజీ డాన్సు. సిగ్గులేని ఇండియన్లు, కాపీ కొట్టడంలో కూడా నాసిరకమే” అంటూ వందలకొద్దీ కామెంట్లు.

ఏదో సరదాగా తెలుగు పాటలు చూసుకుందాం అని యూట్యూబు తెరిచిన నాలాంటి వాళ్ళకి ఇదీ కనపడేది. మన సంస్కృతి పరువు మర్యాదలని ఇలా తేరగా గంగలో కలుపిన ఆ డైరెక్టరుని ఏం చెయ్యాలి ? తమ అభిమాన హీరో పరువుని ఆ వీర ఫేనులు ఎలా కాపాడుకుంటారో వారికే తెలియాలి ఇప్పుడు. రుద్రవీణ, స్వయంకృషి లాంటి మంచి సినిమాలు చేసిన చిరంజీవిని చివరికి ప్రపంచమంతా చూసేది ఈ వీడియో ద్వారా.

పదేళ్ళనాటి సంగతి. కాకినాడలో ఇంటర్ చదువుకునే రోజులు. ఓసారి బాలకృష్ణ సినిమా ఒకటి, చిరంజీవి సినిమా ఒకటి ఒకేసారి థియేటర్లలో రిలీజయ్యాయి. వీరఫేనులు ఒకరితో ఒకరు తెగ దెబ్బలాట పెట్టుకున్నారు. వారితో ఆగితే బానే ఉండేది. రోడ్డుమీద వెళ్తున్న మనుషులని పట్టుకుని “నువ్వు చిరు ఫేన్వా, బాలయ్య ఫేన్వా ? ” అని అడిగేవారు. తప్పు ఆన్సరు చెప్తే నాలుగు ఉతుకులు ఉతికేవారు ! ఈ దెబ్బకి జడిసి రోడ్డుమీద నడిచివెళ్ళాలంటే భయమేసి కూర్చున్నారు అందరు. చివరికి, పొలీసులకి తిక్కరేగి రౌడీమూకల్ని తన్ని బొక్కలో తోసారు కొన్ని రోజులు.

ఇదేదో పిచ్చ ఫేనుల వెర్రి అనుకున్నాను నేను. తరువాత తెలిసింది, దీనికి ఇంకా లోతు ఉందని. చిరు ఫేన్లందరు కాపులు, బాలయ్య ఫేన్లు కమ్మవాళ్ళు. కులపోరుని ఇలాగ రోడ్డుమీదకి తెచ్చి వాళ్ళ హీరోలకి అంటగట్టారు. ఏవనాలి వీళ్ళని !!? ఇప్పుడు వీరందరికీ రోజూ ఆ యూట్యూబు పేజీలు చూపించాలి.

ఇప్పుడు ఈ చిరంజీవి యూట్యూబు వైభోగం చూసి బాలయ్య ఫేన్లకి పారాహుషార్గా ఉండుంటుంది. ఇంకా బాలయ్య తొడకొడితే ట్రెయిను వెనక్కి పరిగత్తే సీను కనుగొనలేదు జనాలు. దాన్ని చూసిన తరువాత ఎవ్వడికన్నా నోరు పెగుల్తుందా ?

ఇంతకీ ఇదా మన తెలుగు సంస్కృతి, మనం చూసి గర్వపడాల్సినది ? మనకేమన్నా బ్రెయిను డామేజీయా ఇలాంటి సరుకుని మార్కెట్లో ఆడించడానికి ? ఇంకా 80లే నయము. ప్రస్తుతమున్న తెలుగు సినిమాలు చూస్తుంటే వాంతి వస్తోంది. నేను బొత్తిగా సినిమాలే చూడడం మానేసాను. ఎప్పుడో బస్సులో హైదరాబాదు నుండి ఇంటికి కాకినాడ వెళ్తుంటే టీవీ పెట్టేసేవారు, గత్యంతరం లేక చూడాల్సివచ్చింది కొన్ని ఆణిముత్యాలని.

ఎనభై మిలియన్లమంది జనాలట తెలుగువాళ్ళు. ఇంతమంది కలిసి సాధించేది ఏమిటి ? ఇన్ని డబ్బులు సంపాదించుకుని అమెరికాలలో కులుకుతున్న వాళ్ళందరూ ఈ చివాట్లు, అగచాట్లు పడాల్సిందేనా ? మనకేమి తక్కువ, ఐఐటీ ప్రవేశ పరీక్షలలో అన్ని రాంకులు కొట్టేది మనమేగా. ఐఏయెస్ పరీక్షలో ఈసారి ఫస్టు రాంకు కొట్టింది మనవాడే.

ప్రతి తెలుగువాడికి నేను చేసే విన్నపం ఏమిటంటే బుర్ర ఉపయోగించండి. ఏమాత్రం టాలెంటు ఉన్నా ఖాలీగా కూర్చోవద్దు. సృజనాత్మకమైన జీవితమే సరైన జీవితం. మూసపద్ధతిలో బండిలాగడానికి మనమేమి చాకలోడి గాడిదలం కాదు. మెదడున్న మనుషులం.

ఇంక కులం సంగతికొస్తే ఇది మనకి అతి సిగ్గుచేటు. ఏంటి మనలో మనకి తేడాలు ? ఈ రోజుల్లో ? ఇంకా ప్రతీవొక్కడు వాడి కులం అమ్మయిలనే పెళ్ళి చేసుకుంటున్నాడు. వాళ్ళ కులం నాయకులకే ఓట్లు వేస్తున్నాడు. వాళ్ళ కులం వారికే ఉద్యోగాలిస్తున్నాడు. ఇక వాడికులం హీరోకే జైజైలు కొడుతున్నాడంటే పిచ్చి ఎంతముదిరి ఉందో తెలిసొస్తుంది.

నా అదృష్టం బాగుండి ఒక మంచి ఇంజనీరింగు కాలేజీలో పడ్డాను. మా ఫ్రెండ్సు కులమేమిటో ఇప్పటికీ తెలియదు. కానీ ఇంటర్ ఫ్రెండ్సు చెప్పేవారు వాళ్ళ కాలేజీలలో సంగతి – రాగింగు టైములో అడిగే మొదటి ప్రశ్న “ఏంట్రా నీ బ్రాండు ?” అని. అదేంటో వెనకేసిన స్టాంపు లాగ. ఇలాంటి వాళ్ళు బతికి ప్రయోజనం ఏమిటి, వెంటనే చచ్చిపోవడం మేలు, కొంత జనాభా తగ్గుతుంది.

శ్రీశ్రీ పుట్టిన రాష్ట్రమేనా మనది ? కందుకూరి వీరేశలింగం పుట్టింది ఇక్కడేనా ? కులం పేరుతో పెళ్ళి ప్రకటనలేంటి ? ఇది ఎంత నీచంగా ఉందో ఒకసారి ఆలోచించి చూడండి.

19 responses to “సినిమాలలో కూడా కులజాడ్యం

 1. బా చెప్పావ్, కానీ ఏదో అమెరికాలో ఉన్నోళ్ళమీద జాలి పడుతున్నట్టున్నావే – అమెరికాలో మన ఘనులు అదే కుల గులతో విడిపోయి రెండు సంఘాలు పెట్టుకున్నారు – ఇంకేం చెబుతాం?

 2. కనీసం విదేశాల్లో అయినా ఈ దరిద్రం వదులుతుంది అని ఆశిద్దాం. ఎందుకంటే, కులం వ్రాయాలన్నా ఫారములో వీలు లేదు..హహ్హహ్హా…

 3. ఏదేశమేగినా ఎందుకాలిడినా
  వదలకో నీకులపు గజ్జి నాయన్నా
  అన్నస్పూర్తితోనే తెలుగువాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఎవరైనా బీహారు ప్రస్తావన తెస్తే నాకు ఉలిక్కిపాటు కల్గుతుంది. దాక్షిణాత్య బీహారైపోయింది మన రాష్ట్రం. ఈ మధ్యన రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ, సామాజిక గొడవలు కాస్త గమనించండి- నాతో ఏకీభవిస్తారు.

 4. మంచి సత్తా ఉన్నవాళ్ళందరూ, సాఫ్టువేరోళ్ళు అయ్యికూర్చునే సరికి, ఉన్న ఒకే ఒక కళ సినిమా, చేతగానోళ్ళ చేతుల్లోనుంది.
  కాబట్టి….

 5. చాలా అద్భుతంగా విశ్లేషించారు. చాలా బాగుంది.

 6. టపా బాగుంది.

  సత్తా ఉన్నోళ్ళందరూ సాఫ్ట్వేర్ వాల్లయ్యారు కాబట్టి మిగిలిన రంగాల్లో (కనీసం సినిమా) చేతగాని వాళ్ళున్నారనటం న్యాయంగా లేదు. సినిమాలు అలా తగలడుతోంది చేతనైన వాళ్ళు లేక మాత్రమే కాదు!

  ఎక్కువ భాగం సాఫ్ట్వేర్ వాళ్ళు ఉత్పత్తి అయేది ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీల నుంచే కదా!? ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలలో, విశ్వవిద్యాలయాల్లో కులాల కొట్లాటలు లేవు? ఒక్క సినిమా రంగంలోనే అనేముంది…ప్రతి రంగంలోనూ కులాల కుమ్ములాటలు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఉంటాయి.
  కులాల వారీగా మంత్రి పదవుల్నీ, ఇతర రాజకీయ పదవుల్ని పందేరం చేసే సంస్కృతికి వీడ్కోలు చెప్పడం ముందస్తు జరగాల్సిన మార్పు! ఆ మార్పుననుసరించే మిగిలిన మార్పులు జరుగుతాయి.

 7. baavundi kaani, meeru kooda vyasam lo kulaala perlu prastaavinchaaru…..ikamundu ilaa jaragagundaa jaagartha padathaaranukuntunnanu.
  -Satyavaani

 8. మీ అభిమానానికి చాలా థాంక్సు 🙂 మనమందరం వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా ఉంచుకోవాలి. మీ ఉద్యోగానికే మీరు అంకితం కాకండి. కళ పాటించడానికి కళాకారులు కానక్కర్లేదు, ఉత్సాహం ఉంటే చాలు. గొప్పవళ్ళందరు అట్టే పుట్టలేదు, కష్టపడి పెంచుకున్నారు టేలెంటుని. మనమందరం కూడా అట్టే చేద్దాం.

  సత్యవాణి గారు
  ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే తప్పేమిటి ? నేను ఏ కులాన్ని కించపరచలేదు కదా. పేపర్లలో ఒక మతప్రార్థనాస్థలంలో – ఇలాంటి రిపోర్టింగు చేస్తారు. జనాలకి అర్థమయ్యి చావదు – అది గుడా, మసీదా, గురుద్వారాయా అని. BBC లో ఇలాగ ఉంటుందా రిపోర్టింగు ?

 9. కీరణ్ గారు, చాలా బాగా రాసారు. ఈ ఝాడ్యానికి మూలాలు నాయుకులు. అక్కడినుండి ప్రక్షాళన జరగాలి. ప్రతి ఒక్కరిలొను ఈ స్ప్రుహ కలిగితే తప్ప ఈ ఝాడ్యం పోదు.

 10. ఇటీవలి వార్త : బీసీల కోసం వేరే రాజకీయ ప్రత్యుమ్నాయం కావాలని సమాలోచనలు. అందులో ఒక మాజీ ఐ ఏ యెస్ అధికారి అయిన ఓ నేత ప్రకటన “చిరంజీవి బీసీలని నాయకత్వం వహించడానికి ముందుకు రావాలి. ఒకవేళ వస్తే పాదాభివందనం చెయ్యడానికి కూడా వెనుకాడను” అని. విలువలు ఎంతగా దిగజారిపోయాయో అని ముక్కుమీద వేలేసుకున్నాను !!

  చిరంజీవి సినిమాలు ఎంజాయి చేసినప్పుడు ఎప్పుడు హీరో ఏ కులం వాడు అని ఆలోచించలేదు. ఈ మూర్ఖులు చివరికి చిరంజీవిని కుల రాజకీయాల రొచ్చులోకి దించేవరకు ఊరుకోరు బహుశా. వీధుళ్ళో చేసిన కోట్లాటలతో ఆగరు.

  “మన కులం వాడు, మనోడు, మనకేదో చేసిపెడతాడు” అని మూర్ఖంగా కులనాయకులకి రాజకీయ అధికారం అప్పజెపుతున్నాం. ఆ నాయకులు భోగపడుతున్నారే కాని, ప్రజలకేమన్నా చేసేది శూన్యం. నిజంగా ప్రజలంటే ప్రేమ ఉన్నవాళ్ళు కాదు ఈ నాయకులు. చేసిపెట్టేది సున్నా. కనీసం నియోజకవర్గ ప్రజలమీద గౌరవం కూడా చూపించరు, ఎన్నికల సమయంలో తప్ప. డబ్బులు దిండుగా ఉన్నవాళ్ళమీద, వారి బంధుగణం మీదా తప్ప, వారి సొంత కులం జనాలమీద కూడా ఇసుమంత గౌరవం చూపించరు ఎవ్వరు. ఇంకా 60 ఏళ్ళ తరువాత కూడా మూర్ఖంగా కుల-నాయకులకి ఓట్లు వేస్తున్నారంటే మనవాళ్ళ పిచ్చి ఎంతగా ఉందో ఊహించొచ్చు.

 11. Chala baga chepparu. Inta mandimi vunnamu kaani after talking and interacting with countless Indians abroad for the past 10 years or so, naakemi anipistundi ante, there is a certain apathy about such things -hsould I say judgemental apathy (oxymoron?). Having said that, the truth is that in todays world, there is shamless plagarism that goes around in the name of inventiveness – what about “power yoga/kundalini..inka naa moham yoga”? Antavarakendukandi, monne madhye kada turmeric was almost patented by the Americans?
  Kulam vishayam antara – endukandi anta siggu manaki? Idi mana society. Indulo kaapulu, brahmalu vunte tappenti anta? England lo kooda work place lo adugutoone vuntaru okallani okallu- are you Welsh/Scottish/Yorshire…ila. Kulam peruto akramala sangati kaadu nenu maatladutundi. Just the fact that we have a certain way of identifying the diversity that exists in our culture. Tappemitantaaru daanilo?

 12. ఇందిర గారు
  మీరు చాలా అమాయకంగా ప్రశ్నించారు. ఇంగ్లీషువారు స్కాటిషు వారిని పెళ్ళిచోసుకోకూడదని నిబంధనలేమన్నా విన్నారా ? అలా చేసుకుంటే ఇంగ్లీషు సంఘాల నుండి వెలివేస్తారా ? స్కాటిషువాడైనందుకు “షాన్ కానరీ” సినిమాలను ఇంగ్లీషువారు చూడరా ? ఎవ్వడైన “నేను షాన్ కానరీ ఫేను” అంటే వాడిని చితకగొడతారా ?

  కులభావన అనేది పక్కా జాత్యహంకారం. భాష/సంస్కృతి మీద అభిమానం,గౌరవం ఉంటే అది మంచి చేస్తుంది. జాతి మీద ఉండే ప్రేమ పిచ్చిదనం, మూర్ఖత్వం. మనవాళ్ళు దీనితో కరడుగట్టి మూర్ఖులవలే ఉన్నారు.

 13. There are two completely different things here. One is the recognition that there is something wrong with the way in which a system is being misused. Another is finding fault with the system it self. Mimmalni tappupattadam ledu (I have come to this recognition myself having gone through the whole circle of criticisim-cynicysm,absloute shunning and finally introspection and acceptance-guess that comes with age) kaani oka saari aalochinchi choodandi- the fact remains that kula vyavasta ivaltidi kaadu. Daanini manam eeroju interpret cehstunna vidhanam nijamga heyamainade kaani anduvalana aa vyavaste chetta ante maatram oppokodaaniki naaku manaskarinchadam ledu. I feel that sometimes in our zealousness to deny the wrong in our society we shun the whole system (especially us-the expat indians) and try to adopt what is “acceptable” by other societies. It is a little like giving up your identity in order to belong if you know what I mean.

  Meerannaru kadu scot ni pelli chesukunte samajam english vaadini veli veyyadani( it is a fact that they will obviously face oppositions from their families- but again, the way we depend on family and relations is very different from the way an english person would relate to his)? Alage vere kulam vaallani pelli chesukuntunna mana vaallani (me included) ee rojulalo evarandi “veli” vestunnnadi?

  Eerojulalo kooda kulam peru meeda politics nadipistunnaru adee nizame. Adanta kulam meeda abhimaaname antara? Kulam kaakapote region (telengana laaga), adi kaakapote bhasha, adi kaakapote religion (mana bush gaari laga). Ivvani kaaranalu kaadu, pretexts maatrame.Adandi naa aalochana.

  Meeru raastunna blog maatram chaala baagundi. Cynicism to paatu appudappudu koncham venakki jarigi choodandi (perspective) mee writing inka chaala baaguntundani naa vuddesam (maatrame)!

 14. కులం … కులజాడ్యం కూడా కొంతవరకూ మన ఇంటి వాతావరణం బట్టి వస్తుంది.. కొంతవరకు మనం పెరిగిన ప్రదేశం ని బట్టి కూడా. నేను స్కూలు దాకా ఓ మామూలు టౌన్ లో పెరిగాను. తరువాత భాగ్యనగరం వచ్చాను. చిన్నప్పట్నుంచి ఇప్పటి దాకా నాకు ముప్పాతిక సాతం స్నేహితుల కులం తెలీదు మరి. ఆ మిగ్తా వారివి కూడా తెలిసింది.. వాళ్ళుగా చెప్పినప్పుడో… ఆహారపు అలవాట్ల వల్లో…పెళ్ళిళ్ళకు వెళ్ళినప్పుడో… ఇలా. మిగితా ఊళ్ళలో తెలీదు కానీ, రిలేటివ్ గా హైదరాబాద్ లో కులం పిచ్చి కాస్త తక్కువే … రిలేటివ్ గా అంటున్నాను. ఏ విజయవాడో…విశాఖో తీసుకుంటే ఇక్కడికంటే ఎక్కువని అక్కడి నా స్నేహితులు అంటారు.

 15. srisri gaari bhaarya mariyu live in iddaru brahmins mari aayanani oka pedda revolutionary ani anukovadam thappu. nenu okappudu aayana fan ni personal life lo chaala chinna manishi aayana raatalu maatrame peddavi.

 16. మీ బ్లాగ్ కొద్దిగా ఆలస్యం తారసపడటం చేత… మీ చర్చను మిస్ అయ్యాను…

  ఇక పొతే… కులపోరుగురించి కులజాడ్యం గురించి భహుచక్కగా విశ్లేషించారు కానీ… మన చర్చలో పాలుపంచుకున్న్న వారు … ఒక చిన్న విషయం lo పొరబడ్డారు … తెలివంత సాఫ్ట్వేర్ తయారీకి ఈజిప్ట్ ఫర్హొహ్ (pharaohs) లాగా కష్టపడూ వుంటే కళాకారులు లేక కళామ్మ తల్లి గోడ్డుపొయినట్టు అనటం జీర్ణించుకో లీక ఈ ఇలా రాస్తున్నాను…..

  ఇండియాకు సవితిపోరులగా(అమెరికా లో )…. ఛైన వుంటే …. మనకు పక్కనే తమిళనాడు వుంది …. అక్కడ కూడా మన రాష్ట్రం లాగానే సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువే… IAS లు IPS లు వగయిరా వగయిరా …. అన్ని మనకు సమంగానే వున్నాయి….. అక్కడ కూడా .. కుల జాడ్యం ప్రతి పనికీ ఆదినుంచీ అంత్యం వరకు వుంటుంది ….. మరి …వాళ్ళ మూవీస్ లో కొత్తదానం వుండటానికి కారణం ఏమిటఁటా…… ?? వాళ్ళ సాఫ్ట్వేర్ ఫరాహ్స్ అందరూ మూవీ ఇండస్త్రిలో వుండవలన ఏమిటి…

  నాకు తెలిసి అభిరుచి మరియు అపోహ ,ఈరెండు మన తెలుగు వారి మూసదోరణ సినమలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి….. మనకు అంటే ప్రేక్షకులకు…. రెండు సినిమా ప్రొడ్యూసర్లకు విశ్లేషకులు విమర్శకులు…పత్రికలవారికి కూడా….ఈ అభిరుచి అనేది లోపించటం అంటాను…..
  నాకు విస్వనధవారి సినిమాలంటే ఇస్తాం అండీ …. ఈ ఫిఘ్ట్ యుద్దపు సినిమాలు , పిచిగంతులు నాకు సుతారం ఇస్తాం వుండదు అని ఒకడు అంటే, ఆ సంగీత సొద నాకు అస్సలు పడదండి అంటారు కానీ పరస్పర గౌరవం ఏమాత్రం పాటిఁచరు ….. అయిన సినిమా అంటే ఇలానే వుండాలి నేను అలాంటివి మాత్రమె చూస్తాను … అని మనకు మనమే బావిలోకప్పలమయితే… తీసేవారు మాత్రం ఎలా తీస్తారు ?

  ఇక పోతే అపోహ ఏంటి అంటే…తెలుగు సినిమా అంటే…ఖచితంగా ఒక సెంటిమెంట్ సాంగ్ గుడ్డముక్కలు కట్టుకున్న మాస్ సాంగ్ ఒక పెద్ద fight డాన్స్ కావాలి అని మన ప్రోడుసుర్స్ కి వున్నా అపోహ…. మనం అనుకున్న్నట్టు ఈ సాఫ్ట్వేర్ పిరమిడ్ కడుతున్న పరొహ్ కూడా అలాంటి ఫార్ములా మూవీస్ ని ఆడరిస్తూనే వున్నారు …. కానీ …. కొత్త నీళ్లు వస్తున్నా నదిలగా…. కొత్త తరం దర్శకులతో ….సాంకేతిక నిపులతో నిండుతున్న…. కల్లమ్మతల్లి…. పరవళ్ళు తొక్కుతుంది… మనకు కావాలండి… దిల్ల్ రాజు లాంటి … ఇంకొందరు యువ ప్రోడుసుస్ వుంటే… “ఆనలుగురు” లాంటి ఆణిముత్యాలు …. బొమ్మరిల్లు లాంటి… కుటుంబకధలు…. ఆది లాంటి … పౌరుష చిత్రాలు ….వస్తూనే వుంటాయి… మనల్ని అలరిస్తూనేవుంటాయి…..
  ” ఒక చిన్న ఓబ్సేర్వషన్ చెబుతాను … సహజం గా … ప్రపంచం లో ఎక్కడికి వెళ్ళిన … మనలాంటి … సినిమా అభిమానులు వుండరు….. (కాకినాడ ఉదాహరనలాంటి కుక్కాభిమానం కాదండోయ్ …) ఎవరన్న తారస పడితే … ఫలానా సినిమా చూసావా అని అడివాళ్ళు వుంటారు కానీ…. ఫలానా సినిమా ఎన్ని సార్లూ చూసవ్ అని అడిగేది … మన ఆంద్రలోనే… అంతటి అభిమానాన్ని … పసిగట్టి… డబ్బుచేసుకునే ఆత్రం మాత్రమె… మన సినిమా నాణ్యతను దెబ్బ కొడుతుందే తప్ప….. మనలాంటి …పిరమిడ్ నిర్మాణదారుల వల్లకాదని…. చర్చ ముఖం గా తెలియపరచుకుఁటున్నాను….

 17. baavundi… chaala mandi chaala rakaluga raasaaru. asalu modata vyasam raasina panditudu evaro kaani aayannu anaali mundu. kulam pichchi leka pothe meeru chranjeevini mana chiranjeevi ani, mana abhimaana hero ani enduku anntto. chiru evariki abhimaana hero?eem chesaadani abhimaana hero? blood bank petta gaane pedda goppa daanaalu chesesinattena? aa blood ammukuntunnarani aayana abhi maanulaki entha mandiki telusu? aayana eem aasinchi party pettinattu? aayana tickets ammukovatam dwara enni crores sampadincharo evaraina oohinchagalara? avanni abaddam antaremo. nippu lenide poga raadani gurthunchu kovaali. na close friend valla mama MLA ticket ni dabbulu petti konnadu. ala 99% varaku tickets konna vaalle.adhikaaaram kosam pagati kalalu kannadu. state lo aayana life time lo CM seat lo koorchuledu. cheppedokati chesesi inkokatina. avineeti rahita party ani prakatinchi, endaro mahanu bhavula perlu vaadukuni, aa party nunchi.. ee party nunchi dabbunna vaallani goondaalani pilichi sankara party okati petti janalani fools cheyyalani chooste janalu nammestara? janalu pichchollu kaadandi.

  eento pichi. assalu film industry lo ayana gurinchi adagandi.. elanti feed back istharo telustundi. eppudoo evariki oka paisa vidilinchina papana poni aayana meeku devuda. chantabbayi cinema shooting lo oka song lo meesam lekunda act cheyyalsina scene kosam shooting spotlo unna andarivi meesaalu teeyinchina ghanudu aayana. aayanana meeru venakesukochchi maatladedi?aayana meeda eedo comedy puttagaane meeku baadha vesinda paapam. aayana kanna goppa vaallu chaala mandi industrylo unnaru,undevaaru. vaalla gurinchi maatladandi oka andam. eeyanaku aa arhatalu levu. influencelatho awards teesukovaam kaadu goppa.antha goppa cinemalu unnaya eeyanavi. oka correct award winning movie choopinchandi apart from swayam krushi, rudraveena. aa rendu kuda goppa acting unna movies eem kaadu. kadhalo balam unnavi. aapadbhandavudu cinema atta(utter flop).asalu chiru kanna balayya meeda ekkuva jokes, inka eentento pudutunnayi. balayya gurinchi feel avvalede tamaru? tamaru ee kulam varo mari? ekkado videsallo koorchuni chaala manchi maatladesaam ante, anukunte ela.

  mee vyasam lo meeru oka kulaniki favour ga unda batte nenu ila raayalsi vachchindi. meeru akkada dabbulu sampadinchukovataaniki vellaru aa pani meeda undandi. ila time pass kosam system mundu koorchuni eedo kanapadithe eedo raasi evarini santhosha pettataaniki?
  mee sampadanalo india lo mana statelo peda vallaki direct ga sahayam cheyyandi. aa rojuna meeru maatladenduku arhulu. kaani alaanti vaallu meela chaala cheap ga maatladaru.

  things will not be same in all dimentions. dont think in one way.

  kosam merupentante nenu aayana party pettaka mundu varaku aayana veerabhimaanine. but he is not on right track.

 18. Cuando se combinan diferentes formas de iluminación se consigue que las superficies verticales y techos estén mejor alumbradas.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s