తెలుగువారికి బిగుసుతనం ఎక్కువా ? అమ్మా, నువ్వంటే నాకిష్టం అని చెప్పేవాళ్ళెంతమంది ? తెలుగుపదం లిస్టులో నేను రాసిన మెసేజిలను కొన్ని ఇటు పోస్టు చేస్తున్నాను.
… అమ్మ గురించి ప్రస్తావించారు కాబట్టి ఒక సింపులు ఛాలెంజి. పొద్దుటే లేచిన తరువాత అమ్మ కనిపడితే “శుభోదయం మాతా” అని చెప్పడానికి ట్రై చెయ్యండి. రిప్లై ఎలా ఉంటుందో ఊహించండి. పోనీ, అచ్చ తెలుగులోకి దిగి “మంచి పొద్దు అమ్మా” అని ప్రయత్నించండి !! ఇక్కడ తెలుగు పదాల అనువాదంలో ఇలాగ జరుగుతోంది.
ఈసారి అమ్మావాళ్ళు ఫొను చేసినప్పుడు, నాకు “mom, I love you” అని చెప్పాలని ఉంది. మన తెలుగులో ఎలా చెప్తారు ? మనం బొత్తిగా మర్చిపోయాం. ఇప్పుడు “అమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని చెప్తే గంజిలో ఆరబెట్టిన మాటలవలే ఉంతాయి. సింపులుగా “అమ్మ ఐ లవ్ యూ” అంటే గడిచిపోతుంది 🙂 ….
… “mom, I love you” అనే మాటను ఆంధ్రదేశంలో ఎవరైనా వారి తల్లులకు తెలుగులో చెప్పిఉంటారా? “I love you” అనే మాటను ఇంగ్లీషువాళ్లు వాడగా మన పట్నాల్లో ప్రజలు అనుకరిస్తున్నారేగానీ పల్లెల్లో పుట్టి పెరిగినవారు I love you వాడుతున్నట్టు కనిపించదు. మనవాళ్లు ప్రేమను తెలపడానికి చాలామాటలేవాడతారు. చిన్న పిల్లలమీద ప్రేమ పొంగితే మురిపెంగా “మా బాబు బంగారం” అంటారు. అమ్మకు ఫోనుచేసి “బాగున్నావా అమ్మా, ఆరోగ్యం బాగుందా” అని అడిగితే ప్రేమను ప్రకటించినట్లుగా అర్థంచేసుకుంటుంది.నాకు తెలిసినంతవరకూ, “నేను నిన్ను ప్రేమించుచున్నాను” అని తెలుగువాళ్లు నేరుగా చెప్పరనుకుంటాను. “అమ్మా, ఐ లవ్యూ” అన్నానంటే కొత్తగా సినిమాటిక్‌గా అనిపించి, నేనేదైనా ప్రమాదంలో ఉన్నానేమో అని మా అమ్మ కంగారుపడుతుంది. …
… మన తెలుగువాళ్ళు “Mom, I love you” అని అసలు చెప్పేవారేకాదు అంటే నేను నమ్మలేను. ఈ వాడుక ఏదొ ఉండి ఉంటుంది, ప్రస్తుతం మూలనపడి ఉంటుంది. అయినా, “Mom, I love you” అని చెప్పలేని భాషా ఒక భాషేనా ! “ఐ లవ్ యూ” అని చెప్పడమేదో ఆంగ్ల సంప్రదాయమన్నట్టు అంటున్నారు. ప్రతీ మనిషికి ఉండే అత్యల్పమైన కోరిక ఇది – ప్రేమని ఇచ్చి పుచ్చుకోవడం. ఇది చేయడానికి వీలు కల్పించని భాష ఆటొమేటిక్గా చచ్చిపోతుంది. … మనుషుల మధ్య “ఐ లవ్ యూ” కూడా చెప్పుకోలేని భాష సుద్ధ వేస్టు. ఆ లైఫే వేస్టు. …
… ఇక్కడ కిరణ్‌గారు ఏదో కంఫ్యూజన్లో ఉన్నట్టున్నారు.
శుభోదయం మాతా! అని వారు ఎందుకు చెప్పలేరో నాకు అర్ధంకావట్లేదు. శుభ్రమైన
రెండు తెలుగు పదాలని ఉచ్ఛరించడానికి ఏమిటి కష్టం? వినే వారికి అర్ధం
కాకపోడానికి అవేమీ ఎవరికీ అర్ధంకాని సంస్కృత సమాసాలు కావే! గుడ్
మోర్నింగ్ అంటే లేని ఎబ్బెట్టు తనం శుభోదయం అంటే ఎందుకొచ్చింది? అలాగే
“అమ్మా నాకు నువ్వంటే ప్రేమ” అన్న నాలుగు పదాలు తెలుగులో చెప్పలేరా?
చెప్పలేరు. ఎందుకంటే అది భాషకి సంబంధించిన సమస్య కాదు కాబట్టి.
అది మన జీవన విధానానికి సంబంధించిన విషయం. ఈ ముఖప్రీతి మెచ్చుకోలు ఐ
లవ్యూలూ, థేంక్సులూ, గుడ్ మోర్నింగ్లూ ఎరువు తెచ్చుకున్న వ్యవహారాలు కనక!
మన జీవన విధానం నచ్చకో, పరాయి వాళ్ళ సంగతులు గొప్ప అనుకునో మనం వాళ్ళని
అనుకరించడానికి ప్రయత్నిస్తున్నాం కనక! భాష మన జీవన విధానం ఆధారంగా
నిర్మించబడినది కాబట్టి ఇలాంటి సందర్భాలలో ఆ పలుకులలో జీవం కనపడక మనకి
ఎబ్బెట్టుగా అనిపించడంలో చిత్రమేమీ లేదు. అంత మాత్రం చేత ఐ లవ్యూ అనికూడా
చెప్పలేని భాష దండగమారిది అనుకుంటూ స్టేట్మెంట్లివ్వడం దుందుడుకుతనాన్ని
ఆలోచనలేమిని మాత్రమే సూచిస్తుంది. ఇంగ్లీషు వాడిని ఎంగిలి ని మీ భాషలో
ఏమంటారు అని అడిగితే ఏం చెప్తాడు? ఏమీ చెప్పలేడు. వాడికసలు అదేంటో కూడా
తెలీదు మరి. అంత మాత్రాన ఇంగ్లీషు మీద కామెంట్ చేసేస్తారా? …
… శిరము మూర్కొనుట అంటే ఏమిటో తెలుసా మీకు ? రామాయణంలో శ్రీరాముడు అడవికి వెళ్ళేముందు భరతుణ్ణి ఒంట్లో కూర్చోపెట్టుకుని శిరస్సుపై ముద్దు పెడతాడు. భరతుడేమీ పిల్లవాడు కాదప్పుడు. ప్రేమని వ్యక్తం చెయ్యడానికి మనకేమి ఎబ్బెట్టు, తిబ్బెట్టులుండేవి కావు.
సంస్కృత కావ్యాలన్నింటిలోని “ప్రియ సఖే” అని మొదలెడతారు మామూలు వాక్యాలని. ఇప్పుడు మనము “ఓసేయి కాఫీ పట్రా” అంటే అదేదో తెలుగులో ప్రేమ ఒలకబోయడం అనుకుంటున్నాం.
“మాతా వందనములు” అనేది సంస్కృతంలో సాధారణ ఉచ్ఛరణ. ఈ ఎబ్బెట్లన్నీ కల్పించేది బానిస మనస్తత్వం. ఉత్తర భారతంలో ముస్లిముల దండయాత్రల పిదప పరదాలు, సతీ సహగమనాలు అంటూ మతం ఎలా కర్కశమయ్యింది ? ఏదో మన కల్చరుకేదో వీర డేంజరు అంటూ ఛాందసులు లేని పోని రూల్సు పెట్టి జనాల బానిస మనస్తత్వాన్ని సొమ్ము చేసుకుంటారు.
ఇప్పుడు మీరు తెలుగుకి చేస్తోందీ అదే. ఇంగ్లీషు వాడు వెళ్ళిపోయి అరవై ఏళ్ళయ్యినా మన బానిస మనస్తత్వాలని మనం వదల్లేదు. ఎక్కడ ఏ ఇంగ్లీషు పదం లోపలికొచ్చేస్తుందో ఏంటో అంటూ వీర టెన్షను. ఇలాంటి టెన్షనుపడే జనాల చేతుల్లో తెలుగుని పెడితే అన్నీ ఎబ్బెట్టు-తిబ్బెట్టుగానే తయారవుతాయి.
“అమ్మా నువ్వంటే నాకిష్టం” అని మాత్రం చెప్పే మనుషులెంతమంది ఈ రోజుల్లో ? కొన్ని రోజుల్లో ఈ వాక్యం కూడా “అమ్మ నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అంటే ఎంత వికారంగా ఉందో అలా తయారవుతుంది. కారణం మీరు తెలుగు పదాల పరిరక్షణ అంటూ తెలుగు కల్చరు మీదనే దెబ్బ కొడుతున్నారు.
తెలుగు కల్చరునుద్ధరించడం అనేది తెలుగు భాషనుద్ధరించడం కన్నా చాల ఉత్తమమైన ఆశయం. ప్రస్తుతం అధమాధమ పాతాళంలో ఉన్నాం మనం. “ఐ లవ్ యూ” అనొద్దు, “గుడ్ మార్నింగ్” అనొద్దు అంటూ మూతులు కట్టిపడేసి కళాకారులను కోల్పోతున్నాం . ఈవిధంగా కోల్పోయే ప్రతీ కళాకారునికి తెలుగుభాష లోటయ్యినట్లే.
నేను చెప్పిన “ప్రేమ” ఉదాహరణలకి ప్రతిగా శ్రీరాం గారు “ఎంగిలి” గురించి ఎత్తారు. అంతకంటే మించిన కన్సెప్టే లేదా ఉదహరించడానికి !! ఆలోచన్లన్నీ ఇలాంటి ద్వేష భావాలతో కమ్ముకుపోయినప్పుడు మదికీ ఇంకేమి స్ఫుటించవు. “మైలపడడం” గురించి ఉదహరించలేదు సంతోషం.
ఫ్రెంచిలో ప్రతీ చిన్న దానికి “శుభ అది” “శుభ ఇది” అంటూ చెప్తారు. భోజనం చేస్తుంటే ముందు “బోన్ అపెతీ” (శుభ ఆకలి) అని కాసేపటి తరువాత “బోన్ కొంతిన్యువాశియోం” (శుభంగా కంటిన్యూ చెయ్యండి) ఫైనలుగా “బోన్ దెస్సేర్” (శుభ ఐస్క్రీము) అని అంటారు. మన తెలుగులో వీటికేవన్నా పదాలుంటాయా ? కాని, అంతా తిన్న తరవాత “జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం” అనే సంప్రదాయం మనకే ! 🙂 …
అద్భుతం. ఇణ్ణాళ్ళూ ఇలాంటి ఒక సున్నితమైన విషయం గురించి నేను కూడా సంఘర్షణకి గురవుతూనే ఉన్నా. ఈ పోస్టు చదివడం నా అదృష్టం.
తెలుగు-ఇంగ్లీష్ విషయంలో మొదలైన నా కంఫ్యూజన్ కి నింపాదైన మీ పోస్టువల్ల ఒక బ్రేక్ పడింది. ధన్యవాదాలు కిరణ్ గారు.
కళాకారులంటే మీలంటి వారే అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సున్నితమైన విషయాన్ని వివరంగా చెప్పగలిగారు కదా మరి!
మీ మెచ్చుకోలుకి చాలా థాంక్సండి 🙂 నేనమీ కళాకారుణ్ణి కాను, తెలుగునేలకి దూరంగా ఉంటున్న ఓ తెలుగువాడినంతే.
excellent, really supurb
జయగారు
మీ కామెంట్లకు చాలా థాంక్సు 🙂
its not a comment but purely compliment
its not at all comment, but COMPLIMENT
chaala baagundi guru
హ్మ్మ్… నిజమే, ఒక్కో భాష లో ఆ భాష కే ప్రత్యేకమైన నానుడులు ఉంటాయి. ప్రతి దానికి మన భాష లో ఉందా? అని వెదుక్కుంటే ఎలా?
ఏ భాష లోకి అయినా కాలం గడిచేకొద్దీ మరో భాష పదాలు రావడం సహజం. దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించినా అడ్డుకోలేరు… ఎందుకంటే ఇది గ్లోబల్ విలేజ్ కనుక. 🙂
వొహ్ అస్సలు.. ఏంటండి బాబు మీరు… నాకు మీ బ్లొగ్ చందివింతర్వాత మాతలు రావదం లేదు…కాని తెలుగులోనే మాట్లదాలి అని…అందుకే.. మీ బ్లోగ్ ని superb అని కాకుంద..అద్భుతం అని ప్రశంసిస్తున్నాను.
ఈరొజే మా అమ్మతో చెప్తాను “అమ్మ నువ్వంటే నాకు చాల ఇష్టం అని” -> రొజూ చెప్పే “mom i love you so much” కాకుంద..
ఢన్యవాదాలు…
“అమ్మా నాకు నువ్వంటే ప్రేమ” ITS A LOVABLE LOVE IF YOU LIVE IN IT. just try it…………………
chaala kaalam tharuvath eelanti kaburlu telusukuntunnamu
chaala bagundi.marutunna prapancham lo ilanti pathalu avasaram.telugu basha tana svagatam cheppinattu chakkaga undi.chivara,SUPERB kaadu kaadu adbutam sir!!HATS OFF-sorry deeni anuvadam telidu but i m not critisizing but plz do reply the word for hats off.thank u very much sir again….
chaala bagundandi
i am so happy to see this type of comments ,,cu byeeeeee
hi to every body this is sudheer , byeeee
hai , chala bagundi. nenu na pillalaki amma nanna ani nerpanu. ma colony lo na pillale ala pilustaru. chala goppaga nenu anukuntanu.
balu
చాల బాగుంది అన్న
CHAALAA BAAGUNDHI MEE TELUGU LO PRAYATHNAM
MAATA LENDHUKU AMMA NAA MUDDHUKE MURISIPOTHUNDHI
PAAPAAE MUDDHISTHY PREMINCHI NATTE — ANTAARU O PAATALA GAJAL SRINIVAS
BAAGUNDHI CHAALAA BAAGUNDHI
meeru chesinaprayatnam good srinivas vizag