ఆచార్య మండలి అవసరం

ఇప్పుడు ప్రెసిడెంటు ఎన్నికల సందర్భంగా చాలా తమాషా జరుగుతోంది. మూడో ఫ్రంటు సడెన్ గా కలాం పేరు పైకి తెచ్చి ప్రెసిడెంటు పదవికి రాజకీయాలకు అతీతుడైన వ్యక్తి ఐతేనే బాగుంటుంది, విద్యావంతుడైన కలాంకి మళ్ళీ అవకాశం ఇద్దాం, అని మిగతా పార్టీలని అడిగింది. పైకి చెప్పేది ఏదైనా ఈ ప్రయత్నాలన్నీ ఉనికి పోతుందేమోనన్న గుబులుతో ఉన్న మూడో ఫ్రంటు స్వయం అస్థిత్వ తపనతో చేసిన యత్నాలే. మొత్తం మీద కలాం ఒప్పుకుని చివరకి ఖంగుతిన్నారు. కాంగ్రెసు పార్టీ ససేమిరా కలాంకి సపోర్టు ఇవ్వడానికి నిరాకరించింది. ఇక లెఫ్టు పార్టీల సంగతి సరే సరి. వారి వాదన ఏమిటంటే ప్రెసిడెంటు పదవికి రాజకీయ ప్రవేశం ఉండి, రాజ్యంగం గురించి తెలిసిన వ్యక్తి అయితేనే మంచిది అని.

భారతీయులకి మాత్రం కలాం అంటే చాలా గౌరవం ఉంది. ప్రెసిడెంటు పదవికి ఔన్నత్యం తెచ్చి ఇచ్చేందుకు ఒక విద్యావంతుడిని నిలబెట్టడం అంటే పెక్కుమందికి ఇష్టం. రాజకీయలన్ని కుళ్ళుతో నిండిపోయాయని బహుళ జన అభిప్రాయం.

ఈ పోస్టులో నేను ఈ ముఖ్యమైన విషయంపై రాయాలని నిశ్చయించుకున్నాను. భారతదేశంలో ఒక మెరిటోక్రసీ (విద్యావంతులకు ఉన్నత పదవులను ఇచ్చే ప్రభుత్వం) ఉండటం వలన ఏమిటి ప్రయోజనం అనేది నా పోస్టు ఉద్దేశ్యం.

మన సంప్రదాయంలో ఉన్నత పదవులను ఒక ఆచార్యుడికి ఇవ్వడం అనేది పెక్కు తరాలుగా వస్తున్నది. రాజుల కాలంలో కూడా మంత్రి పదవికి ఒక ఆచార్యుడిని ఎన్నుకునేవారు. కీలకమైన విషయాలలో వారి అభిప్రాయం తీసుకోవడం, వాటిని గౌరవించడం అనేది ప్రభుత్వానికి మంచిది అని వారి నమ్మకం. మన ప్రస్తుత ప్రజాస్వామ్యంలో ప్రెసిడెంటు పదవి కూడా ఒక సలహాదారుణి పదవి వంటిదే. డైరెక్టుగా అధికారాలు ఏమీ లేకపోయినా, శాసన సభకి సూచనలివ్వడం, మార్గ నిర్దేశం చెయ్యడం ఉపన్యాసాలివ్వడం ప్రెసిడెంటు విధులు. ఆ పనులని కలాం అద్భుతంగా నిర్వహించారు. ఒక శాసనసభకే కాక దేశ ప్రజానికానికి కూడా మంచి ఉపన్యాసాలిచ్చారు. ఇటువంటి ప్రెసిడెంటు ఉండటం వలన దేశంలోని ప్రజలందరికి ఎంతో గర్వకారణం.

మన దేశంలో విద్యావంతులందరూ రాజకీయాలను అసహ్యించుకుంటున్నారు. దేశానికి సేవ చెయ్యాలన్న తపన ఉన్నా, రాజకీయల కుళ్ళు లో ముందుకు సాగలేమన్న నిజం అందరికీ తెలుసు. మన దేశం ప్రస్తుతం ఎందరో దేశభక్తుల సేవలను ఈ విధంగా కోల్పోతోంది. చాల మంది తెలివైనవారు విదేశాలకు వలస పోతున్నారు. ఇటువంటి ఉన్నత విద్యావంతుల సేవలను దేశానికి రప్పించాలంటే ప్రస్తుతం ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధించలేము. మన ఎన్నికలన్నీ కుల, మత రాజకీయల కంపులో మగ్గిపోతున్నాయి. అమాయకులైన ప్రజానికం వారి ఓటు హక్కును సరిగ్గా ఉపయోగించలేకపోతోంది.

ఇటువంటి సమయంలో ఒక జనరంజకమైన ఆలోచన విద్యావంతులకు రాజ్యనిర్వహణ అధికారాలను ఇవ్వడం. కానీ, ప్రజాస్వామ్యానికి కట్టుపడ్డ మనం అటువంటి పరిస్థితిని కల్పించలేము. పదవిలో ఉన్నవారు ఎలాంటి వారైనా దుర్వినియోగం చెయ్యగలరు. కానీ, గౌరవప్రదమైన సలహాదారుని పదవులలో అధికార దుర్వినియోగానికి అవకాశమే ఉండదు. అటువంటి పదవులకుకు విద్యావంతులను ఎంపిక చెయ్యడం అనేది అద్భుతమైన ఆలోచన. అది మన భారతీయ సంప్రదాయానికి చెందిన పద్ధతి.

ప్రస్తుతం, మన ప్రజాస్వామ్యంలో రెండు సభలు ఉన్నాయి – మొదటిదైన శాసన సభలో ప్రజా ప్రతినిధులు ఉంటారు. వీరు ఎన్నికలలో ప్రజలకు ప్రాతినిథ్యం వహిస్తూ ఎన్నుకోబడినవారు. రాజ్య నిర్వహణ అధికారాలన్నీ వీరి చేతుల్లోనే ఉంటాయి. కానీ, రెండవదైన శాసన మండలిని మనం సరిగా వినియోగించుకోవటం లేదు. ఈ రెండవ సభ ముఖ్య విధులు మొదటి సభకు దిశానిర్దేశం చెయ్యటం, తప్పులను సవరించటం. ఇటువంటి సలహాదారుని విధులు కలిగిన ఈ సభకు ఉత్సాహవంతులైన విద్యావంతులను ఎంచుకోవడం అనేది ఒక మెండైన ఆలోచన. ఈ మండలి సభ్యుల కింద పెక్కురంగాలలో బాగా రాణించినవారిని తీసుకోవడం జరగాలి. వీరిని రాజకీయాలకు, పార్టీలకు, ఎన్నికలకు సాధ్యమయినంత దూరంగా ఉంచాలి. అధికారాలు డైరెక్టుగా ఏమీ లేనందువల్ల, అధికార దుర్వినియోగం జరుగుతుందేమో అని భయపడనవసరం లేదు. కాని, ఇటువంటి విద్యావంతులు ఆచార్యుల వలే ఉపన్యసిస్తూ, ప్రజలందరికీ (ముఖ్యముగా మొదటి సభలోని ప్రజా ప్రతినిధులకు) దిశా నిర్దేశం చెయ్యగలరు. సామన్యముగా జనాలకు తెలిసి లేకపోయినా, ఈ విధముగా పరిచయం కాగలరు. అప్పుడు, వీలైతే డైరెక్టుగా ఎన్నికలకు కూర్చోగలరు, శాసన సభకు ఎంపిక కాగలరు.

ఈ విధంగా మన రాజకీయల లోని కుళ్ళును నిర్మూలించవచ్చు.

శాసనమండలికి ఎంపిక కావాలంటే, వారి వారి తెలివితేటల మీద మాత్రామే ఆధారపడాలి. ఆచార్య సమోన్నతులైన వీరు, విద్యాలయాలలో ఆచార్యులు ఏ విధముగా ఎంపిక కాగలుగుతారో ఆ విధముగా మండలికి ఎంపిక కాగలగాలి. ప్రస్తుతం విద్యాలయాలో, ఆచారులను ఎంపిక చేసేటప్పుడు వారి సీ.వీ, ఎక్స్పీరియెన్సు మొదలైన అర్హతలను చూసి ఉన్నతపదవలులోనున్న ఆచార్య మండలి ఎంపిక చేస్తుంది. ఇదే విధంగా, శాసనమండలిని ఏర్పాటు చెయ్యాలి.

ప్రస్తుతం ఐ.ఏ.యెస్ మొదలైన విధులకు పరీక్షల ద్వారా విద్యావంతులను ఎంపిక చేసుకుంటున్నారు. కానీ, వీరు కేవలం రాజ్య నిర్వహణ యొక్క పనులను చెయ్యటంలో ఉద్యోగులకింద వ్యవహిరించుటకు మాత్రమే. అందుకని, ఈ విధమైన నిర్వహణావిద్యలను, నైపుణ్యాన్నీ పరిగణలోకి తీసుకుని వీరిని సెలెక్టు చేసుకుంటున్నాము. కాని, నేను చెప్పిన ఈ శాసన మండలి ఆలోచన దీనికి సంబంధించినది కాదు. దీనికి సమాంతరంగా, కేవలం సలహాదారుని పదవిలో మొదటి సభకు సూచనలు చెయ్యడం గురించి నేను దానిని ప్రస్తావించాను.

రాష్ట్రాలలో ఈ విధమైన శాసనమండళ్ళను, కేంద్రంలో ఆచార్యసభను (ప్రస్తుతం రాజ్య సభగా ఉన్నది) ఏర్పాటు చెయ్యాలి. ప్రెసిడెంటు పదవికి కేవలం ఈ ఆచార్యమండళ్ళలో పనిచేసిన వారిని మాత్రమే ఎన్నుకోవాలి. వీలైతే, ఈ ఎన్నికను ప్రజలందరిచేతా జరిపించాలి. మన రాజ్యాంగానికి ఈ విధమైన సవరణ తీసుకురావడం అనేది తప్పనిసరి.

5 responses to “ఆచార్య మండలి అవసరం

 1. ప్రజాస్వామ్య పునాదులు కనీసం మనంత కుదురుగా కూడా లేని దేశాల వాళ్ళు తమ దేశాధినేతల్ని మన కలామ్ తో పోల్చుకుని బాధపడుతున్నారు. మనవాళ్ళేమో (పైవాళ్ళే ననుకోండి) కలామ్ కి సొంత బుఱ్ఱ ఉండడం, రాజకీయాలకి అతీతంగా ఉండడం, ఏమీ సంపాదించుకోకపోవడం – వీటన్నింటిని ఆనర్హతలుగా పరిగణిస్తున్నారు.(రాజకీయానుభవం ఉన్న వ్యక్తే దేశాధ్యక్షుడు కావాలట).

 2. మీరు చెప్పింది బానే వుంది , కాని ఇప్పటి విశ్వ విద్యాలయాలలొ రాజకీయం లెదా ? V.C లు ని selection కూడా ఒక కుల మత ప్రాతిపదిక నే జరుగుతుంది . ఎంతో మందికి qualifications వున్న , Recommendations ని mobilize చెయలేరు . శాసనమండలి లొ ఏన్నికైన వారు అందరు విద్యావెత్తలా ? లేక విద్యను వ్యాపారము గ చేసిన వారా ?
  I dont like the idea of having another sabha of educated selfish fools instead let us take one -third seats of the present Rajya Sabha and appoint the meritorius world Renowned faculty from all Universities
  it is not that easy to get a person like Kalaam from the entire Universe , and how many Gandhijis born after him ?

  At the same time how many products invented by Independent India ? where is the Original Research ? how many IIts or Univiersities has the Real original Publications ? and what is their conversion rate into applicability to the Universe ? Do you know how many UGC, CSIR , DST ..etc sponsored projects in India ? and what is happening to the result of those projects ? .
  Even If we able to get one person from each university to start with , definitely there will be chaos in the public if no one selected from that particular university or a state or if Tamilnadu/Bihar/UP has more say in the Center , then naturally more participation of their faculty will be there .
  ఇవన్ని ఇప్పుడు మనకి అవసరమా ?

 3. అయ్యా! మనరాజకీయాలు మీరు చెప్పిన అవస్థలన్ని ఎప్పుడోదాటేసాయీ. ప్రస్తుత రాజకీయాలలో, మీరు సెలవిచ్చిన “ఆచార్య మండలి” దానికి ఆచార్యవర్యుల ఎన్నిక అన్నవి నేతి బీరకాయలో నేయ్యి చందాన తయరవుతాయి. అసలు “రాజ్యసభ/శాసన మండలి” అనబడె పెద్దల సభలకి పంపవలిసిన/పంపతగిన వారేవరండి? (మన రాజ్యంగం ప్రకారమే) విద్యా, వైద్య, సాహిత్య, సాంస్కృతిక, ఇంకా అనేక రంగాలలో నిష్ణనితులైఆ వారు అంటే ఆయా రంగాలలో గురుతుల్యులు/ఆచార్యవర్యులే కదా! మరి ప్రస్తుతం జరుగుతున్నదేమిటి? కుల, మత, లింగ, ప్రాంతీయ వంటి అవకాశవాద రాజకీయరంగాల నుండి పెద్దలు(?) ఎన్నిక కాబడుతున్నారు. మరి ఇలాంటి పెద్దలు తమ ఉనికిని కాపాడుకోవటం కోసం కుల, మత, ప్రాంతీయ ద్వేషాలను రెచ్చగోట్టి తమ పబ్బం గడుపుకుంటారు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు, ఇటువంటి పెద్దల సభనుండి “రాష్త్రపతి” అనబడే రాజకీయ సలహాదారుని ఎన్నుకుంటె, దాని పర్యవసానం ఎలవుంటుందో ఊహించండి. సమూలంగా పదైపోయిన రాజకీయకాసరమండి మనది.

 4. అమాయకులైన ప్రజానీకం ? ఎవరూ ? గవర్నమెంట్ ఆఫీసు కి వెళ్ళినా, హాస్పిటల్ మార్ట్యురీ దగ్గరకు వెళ్ళినా టీ డబ్బులు అని అడిగేవారి గురించేనా మీరు మాట్లాడేది ? ఎక్కడ తమ ప్రియ కుల నాయకునికి మరణించినా సరె, గొడవలు రేపే వాళ్ళు అమాయకులా ? లేకపోతే ప్రతీ దండోరా కి టికెట్ లేకుందా రెండో తరగతి లో గుంపులు గుంపులు గా ప్రయానించే అమాయకుల గురించేనా మీరు మాటలాడెది ?

  లేకపోతే చిన్న మునిసిపాలిటీ ఆఫిసు దగ్గర న్నంచి సేక్రటేరియట్ దాక లంచాలు తీసుకొనే మధ్య తరగతి ఉద్యోగులా అమాయకులు ? లేకపొతే చిన్న చిన్న రికవరీ జాబులు చేసుకొంటూ, ఎవరిని పడితే వాళ్ళని కొట్టే నిరుద్యొగులా అమాయకులు ?

  ఇక పై తరగతి వాళ్ళ గురింఛి చెప్పనవసరం లేదు.

  ఇక్కడ ఎవరూ అమాయకులు కారు. అందరూ అ”మాయకులే”, చిన్న తరగతి, మధ్య తరగతి, పై తరగతి దాక. కాకపొతే అవకాశం రాలేదు అంటె. “ఇంకోలా ఉండటం కుదరక పొతే, మంచి గా ఉండు” అని ఎవరో చెప్పారు.

  అంత అమాయకులే ఉంటే, ఇంత అవినీతి, కుల పిచ్చి, స్వార్ధం ఎక్కడ నుంచి వస్తాయి. మన గురించి మనము ఎమన్నా చెప్పుకొవచ్చు. కాని కొన్నింటిని అంగీకరింపక తప్పదు. వాటినే తెలుగు లో “నిజాలు” అంటారు. వాటిని అంగీకరింపక తప్పదు.

  తప్పు సమాజం (సొసైటీ) లోనూ, వ్యవస్థ (సిస్టం) లోనూ ఊంది. మార్పు ప్రజలలో రావాలి.అది వచ్చిన రొజు, చాల సమస్యలు సమసి పొతాయి. మారనంత వరకూ రాజ కీయనాయకులని తిట్టి లాభం లేదు.

 5. కిరణ్ మీ పొస్టింగ్స్ అన్నీ నాకు బాగ నచ్చాయి . ఒక దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటె కేవలం విద్యావంతుడు కావలసిన అవసరం లేదు . ప్రజల సామజిక అర్ధిక రాజకీయస్తితిగతులు క్షున్నంగా తెలిసినవాడై వుండాలి అన్నది నా అబిప్రాయం. ఈ పొస్టింగ్ నాకు అర్ధం కాలేదు ప్రజస్వామ్య వ్యవస్థ లొ ఎమి సాదించలేమంటూనె దానిని పటిష్టం చేయలంటున్నారు. కుల పిచ్చి , అవినీతి, స్వార్ధం విద్యవంతులని ప్రబావితం చెయట్లేదని నేను అనుకొవటం లేదు . ఇది కలాం సమస్య కాదు. బారత రాజకీయ సమస్య కేవలం దానిని రాజకీయ ద్రుష్టి తొ చూడాలన్నది నా అబిప్రాయం. మీ బ్లాగ్ చాల బాగాఉంది .ఎన్నొ విషయాలు తెలుసుకున్నాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s