తెలుగు భాష ఫ్యూచరు

తెలుగునేల నుండి దూరంగా బ్రతికితే తప్ప తెలుగు భాష తీయదనం తెలియదంటారు. పసివాడని అమాయకత్వం, నిర్మలత్వం రాశిగా పోసి ఉన్న భాష ఇది. అదే సమయంలో, పదాల అమరికలో మెండైన నిండుదనం కలిగి ఉన్న భాష మనది. ఆ కలిమే ఈ భాష యొక్క బలిమి. తెలుగు భాషలో పదనిసలు పలికించాలంటే వ్యక్తి కవి కానవసరం లేదు. కవిత్వమూ చెప్పనవసరం లేదు. మామూలుగా మాట్లాడిపోతుంటే అలంకారాలు అన్నీ అవే గలగలా అమరి కూర్చుంటాయి.

నమ్మకపోతే ఈ చిన్న చిన్న పద ప్రయోగాలు కొన్ని పరికించి చూడండి. “చిలక పలుకులు”, “తీరు మారలేదు”, “సిగ్గు మొగ్గలై” .. పదం పదంలోనూ ఎంతెంత సిమెట్రీ ! ఈ విధమైన పొందిక తీసుకురావాలంటే మరే భాషలోనైన మహాకవులు రావాల్సిందే. అదే మన తెలుగులో చిఱు కుర్రవాళ్ళ మాటలు కూడా గండపిండేరం తొడిగిన రాచకవుల పాటలను పోలి ఉంటాయి.

ఇంతటి ఈ భాష ఇప్పుడు కనుమరుగైపొయే ప్రమాదంలో పడి వుంది. ఈ దయనీయమైన స్థితిలో తెలుగు భాషను ఇరికించిన మహానుభావులకందరికీ నా జొహార్లు. ఒక మహా నది ప్రవాహాన్ని చిందర వందర చేసి, ప్రస్థుతం పిల్ల కాలువ వలే తెలుగు భాషని రూపు మాపు చేసిన ఈ బుర్ర ఎవ్వరిది ? ఎవ్వరిదీ ఆ ఘనత ? తెలుగు భాష శ్రెయస్సుకోసం కంకణం కట్టుకున్న మొక్కుబడి భాషా కోవిదులదీ ఘనత. కథలు వ్రాయటం చేతకాక, పాటలల్లటం పాలుపోక చివరికి తెలుగు భాషనుద్ధరించడం కోసం మొక్కుబడి రూల్సు రాసే ఈ జనులు గవర్నమెంటు వారి పోషణలో పెక్కు సాహిత్య సేవ చేసేసారు. ఇప్పుడు వీరి దెబ్బకి చతికిలబడ్డ తెలుగు భాష తెలుగు వారికందరికీ దూరమయ్యే స్థితిలో ఉంది. జూకెళ్ళినప్పుడు చూసే వింత జంతువు వల్లే చూస్తున్నారు ఇప్పటి కుర్రవాళ్ళు ఈ భాషని. ఇంకొంతకాలం ఆగితే ఈ వింత జంతువు కూడా అంతరించిపోతుంది. అప్పుడు నిక్షేపంగా, అందరూ మరిచిపోవచ్చు మన భాషని.

నా మాటలేమన్న గొంతు దిగకపోతుంటే కొంత నొక్కి చూడండి. ఈ రోజుల్లో, తెలుగు భాషలో గొంతు తిప్పుకోకుండా మాట్లాడగలిగేవాళ్ళు ఎంతమంది ? భాష సరిగా మాట్లాడలేనివాడు సరిగా ఆలోచించలేడు. ఆలోచించలేనివాళ్ళు కళాకారులు కాలేరు. కనుకనే, మన తెలుగు కల్చరు ప్రస్తుతం ఈ అఘోరమైన స్థితిలో దాపురించి ఉంది. సినిమాలకు సినిమాలు, నవళ్ళకు నవళ్ళు, సంగీతానికి సంగీతం, న్యూసుపేపర్లకి న్యూసుపేపర్లు – ఎక్కడ పడితే అక్కడ అధ్వాన్నమైన స్థితిలో ఉన్నాం మనం. మన తెలుగువాళ్ళు ఎనభై మిలియన్లట. ఇంతమంది కలిసి సాధించేది ఇదా ?

10 responses to “తెలుగు భాష ఫ్యూచరు

 1. తెలుగును అణగదొక్కుతున్న చారిత్రిక రాజకీయ ఆర్థిక కారణాల్ని వదిలిపెట్టి మీరు భాషాకోవిదుల మీద పడడం ఆశ్చర్యంగా ఉంది.

 2. చారిత్రిక కారణాలంటూ చెల్లుబాటు చేసుకునే రోజులు పోయి చాల ఏళ్ళయ్యింది. ఇప్పుడు తెలుగు భాషకింకా ఒక డిక్షనరీ లేదు (ఎప్పటిదో రాతియుగమ్నాటి శబ్దరత్నాకరం వగైరా తప్ప) ఈ తెలుగుభాషా సంఘం పైన నాకేవిధమైన మమకారం లేదు.

  అజ్ఞానులైన జనాలని మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటున్నారు ఈ చాంధసులు. తెలుగు భాషకి నిట్టనిలువునా ద్రోహం చేస్తున్నారు.

 3. “ఇప్పుడున్న తెలుగు బ్లగర్లలో అత్యధికశాతం వీరభాషాభిమానులు” అన్న మీరు – ఒక బ్లాగురాస్తే మీ భాష ఎలా ఉంటుందో చూడాలనుకున్నాను. ఈరోజే సీ.బీ.రావు పరిచయం చేశారు. మీరు రాసే భాష మిగతావారి శైలికి ఎలా భిన్నమైనదో గమనించాల్సి ఉంది.
  🙂

 4. మహాశయా
  మీరు బ్లాగు పోస్టుకి చేసిన నామకరణంలోనే మీ చిత్తశుద్ధి శంకించదగినదిగా ఉన్నది. ‘ఫ్యూచరు’ స్థానం లో ‘భవిష్యత్తు’ వాడకమే మీకు కష్టంగానూ వీర భాషాభిమానం గానూ అనిపిస్తే మీ మీద మీరే జాలి పడాల్సిన సమయమిది. భావ వ్యక్తీకరణలో ఎంతో ఉన్నత స్థానం లో ఉంటూ ఘనత వహించిన ఈ తెలుగు భాష ‘ఫ్యూచరు’ గురించి మీరేమీ దిగులు చెందకండి. ఏమైనా నొప్పి కల్గించితే క్షంతవ్యుడను. సెలవు.

 5. మోహను గారు

  ఫ్యూచరు అన్న పదము తెలుగు పదమిప్పుడు. తెలుగువారికందరికీ అర్థమయే భాషే నా తెలుగు భాష. నా భాష ఆంధ్రప్రదేశ్లోని ప్రతి మనిషికి అర్థమవుతుంది. మీలాగ “క్షంతవ్యుడను” అంటూ శష బిషలు పోతే ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు.

  కిరణ్

 6. తెలుగు ప్రచురాయం మాతరం బాగా పెరుగుతుంది ఈ మధ్య తెలుగు ఇంటెర్నెట్ లో బాగా వాడుతున్నారు. thanks to http://www.quillpad.in/telugu

 7. తెలుగువారు, ప్రవాసాంధ్రులు, విదేశాలలోని ఆంధ్రులు అందరికీ – తెలుగు పలుకుబడి, తెలుగు భాషతో చక్కటి పరిచయం, భారతీయ (ఆంధ్ర) సంస్కృతీ భావ జాలంతో చిక్కటి అనుబంధం బల పడాలంటే- ఒక సులువైన చిన్న ఉపాయం; ఫలితం గ్యారంటీ (నిశ్చితం). అదేమిటంటే-

  ప్రతి తెలుగు బాలుదు, బాలిక ప్రాథమిక విద్యా స్థాయిలో (ఎల్.కె.జి.నుంచి ఐదవ తరగతి వరకు)ఎంపిక చేసిన వేమన శతక పద్యాలను కంఠస్థం చేయటమే!

  ఉద్యోగాల కోసం ఇంగ్లీషు మీడియంలో చదివే వారికైనా, తెలుగుదనానికి దూరం కాకుండా ఉండాలంటే, వారి తరగతి తెలుగు వాచకాలలో – క్లాసుకి ౨౦ (ఇరవై) పద్యాల చొప్పున ౫(అయిదు) క్లాసులలో మొత్తం ౧౦౦(వంద) పద్యాలు కంఠస్థ యోగ్యంగా చేర్పించటం జరిగితే, ఆంధ్ర ప్రభుత్వం, విద్యా-సాంస్కృతిక శాఖలు వారి పేరుకి, ఉనికికి సార్థకత, తెలుగు జాతిపట్ల తమ కనీస ధర్మం నిర్వర్తించిన వారౌతారు.

  ప్రభుత్వం వంక చూస్తూ కూర్చోకుండా, తమ తమ పిల్లల వాచిక, మానసిక, సాంస్కృతిక, పౌర, నైతిక వ్యక్తిత్వ వికాసం కోరుకునే తల్లిదండ్రులు- ముఖ్యంగా తల్లులు- ఇంటివద్దే అయిదేళ్ళలో వంద పద్యాలు నోటికి వచ్చేటట్లు చేయగలిగితే, మీ పిల్లలు మీరు ఇఛ్ఛిన ఈ వారసత్వ సంపదకై మీకు తరతరాలా ఋణపడి ఉంటారు!

  మీకు మీకు నచ్చిన పద్యాలను ఎంపిక చేసుకోవటానికై ,రెండు వందల పైచిలుకు వేమన పద్య రత్నాలను kamthasthabharathi.wordpress.com లో వేమన పద్య రత్నాలు అనే పేజీలో చూడవచ్చు.

 8. vaaduka telugu lo javaabulanu iste bhashaa vadakam perugutundi anni maandalika padaalanu oka trati pi cherchi nerpali

 9. Neenu Eelanti blog chudatam ide modata sari…Intha mandhi telugu basha ni kapudu kovataniki pryatnam chesyyatam chala goppa visayham. Mee andhri pryathnalu phalichali ani manasara akanksistanu…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s