తేట తెలుగు – తేనె వంటి తెలుగు

తరలి రాద తనే వసంతం ?

ఆగష్టు 31, 2007 · అభిప్రాయములు

తరలి రాద తనే వసంతం ? తన దరికి రాని వనాల కోసం ?

గగనాల దాకా అల చేరకుంటే, మేఘాలరాగం ఇల చేరుకోదా ?

వెన్నెల దీపం కొందరిదా ? అడవిని సైతం వెలుగు కదా ?

ఎల్లలు లేని చల్లని గాలి, అందరికోసం అందును కాదా ?

ప్రతీమదిని లేపే ప్రభాతరాగం, పదే పదే చూపే ప్రథాన మార్గం ..

ఏదీ సొంతంకోసం కాదను సందేశం, పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం !

ఇది తెలియని మనుగడ కథ – దిశలెరుగని గమనము కద !

తరలి రాద తనే వసంతం ? తన దరికి రాని వనాల కోసం ?

బ్రతుకునలేని శృతికలదా ? ఎదసడిలోనే లయలేదా ?

ఏ కళకైనా, ఏ కళకైనా జీవితరంగం వేదికకాదా ?

ప్రజాధనం కాని కళావిలాసం, ఏ ప్రయోజనం లేని వృధా విలాపం.

కూసే కోయిల పోతే రాగము ఆగిందా ? పారే ఏరై పాడే మరో పదం రాదా ?

మురళికిగల స్వరముల కళ పెదవిని విడి పలకదు కదా !

తరలి రాద తనే వసంతం ? తన దరికి రాని వనాల కోసం ?
గగనాల దాకా అల చేరకుంటే, మేఘాలరాగం ఇల చేరుకోదా ?
తరలి రాద తనే వసంతం ? తన దరికి రాని వనాల కోసం ?

నాకు బాగా ఇష్టమైన సినిమా పాట :)

వర్గాలు సంస్కృతి · సమాజం
Tagged: ,

4 స్పందనలు so far ↓

వ్యాఖ్యానించండి